Home సినిమా వార్తలు సాగుతున్న సాహో…..

సాగుతున్న సాహో…..

ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రానికి కొత్త కష్టాలు వచ్చాయి. ముందు నుండి కూడా ఈ మూవీ ని సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసారు. దాని తగట్టే షూటింగ్ జరుపుకుంటూ వస్తున్నారు. అయితే జనవరి లో రావాల్సి పెద్ద సినిమాలన్నీ సమ్మర్ కు పోస్ట్ పోన్ చేయడం తో సాహో రిలీజ్ కు కష్టాలు వచ్చేలా ఉన్నాయి. మహేష్ – కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భరత్ అను నేను ముందుగా సంక్రాంతి కి వస్తుందని అనుకున్నారు. ఇప్పుడు ఏప్రిల్ 27న మూవీని విడుదల చేయబోతున్నట్టు ఎనౌన్స్ చేశారు. సంక్రాంతికి వస్తామని ప్రకటించిన మరో సినిమా రంగస్థలం కూడా వాయిదాపడింది. ఏప్రిల్ రెండో వారంలో (కుదిరితే ఏప్రిల్ 13) మూవీని థియేటర్లలోకి తీసుకురావాలనేది చిత్ర యూనిట్ ప్లాన్ చేసారు. మరో హీరో అల్లు అర్జున్ ఎప్పటిలాగానే ఈ సమ్మర్ లో కూడా తన సినిమా ను తీసుకరాబోతున్నాడు. వంశీ దర్శకత్వం లో చేస్తున్న నా పేరు శివ ను మే నెలలో రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యాడు. ఇలా ఏప్రిల్ , మే నెలలు పెద్ద సినిమాలతో ఫుల్ చేసుకోవడం తో సాహో రిలీజ్ డేట్ కు కష్టం వచ్చింది. ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం సాహో సినిమాను సమ్మర్ నుంచి తప్పించాలని చూస్తున్నారట. దీనికి ప్రధానంగా సమ్మర్ బాక్సాఫీస్ రద్దీ ఓ కారణమైతే.. సాహో సినిమా షూటింగ్ లో జాప్యం కూడా మరో కారణం అని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here