Home జిల్లా వార్తలు సమ్మెను విరమించారు

సమ్మెను విరమించారు

నెల్లూరు నగరంలో దాదాపు నెలరోజులకుపైగా జరుగుతున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. 279 జి.ఓను వ్యతిరేకిస్తూ నెల్లూరు కార్పొరేషన్‌ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగడం తెలిసిందే! నెలరోజులుగా నెల్లూరులో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి నగరం గబ్బుకొట్టింది. ఎట్టకేలకు 27వ తేదీన కార్మికులు, కార్పొరేషన్‌ పాలకుల మధ్య జరిగిన చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. 279జి.ఓలో కొన్ని సవరణలకు పారిశుద్ధ్య కార్మికులు అంగీకరించారు. దీంతో సమస్య కొలిక్కి వచ్చింది. 28వ తేదీ నుండి పారిశుద్ధ్య కార్మికులు తిరిగి విధులకు హాజరుకానున్నారు. కార్మికుల చర్చల్లో మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌తో పాటు వైసిపి ఫ్లోర్‌లీడర్‌ పి.రూప్‌కుమార్‌ కూడా పాల్గొని సమస్యను దారికితెచ్చి సమ్మెకు ముగింపు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here