Home రాష్ట్రీయ వార్తలు సమాజంలో మార్పు కోసమే నా ప్రయత్నం – సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

సమాజంలో మార్పు కోసమే నా ప్రయత్నం – సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

సమాజంలో మార్పుకోసం ప్రయత్నం చేయడం తప్పు కాదు…నిజాయితీగా ప్రయత్నం చేస్తే విజయం వరిస్తుంది అనేది నా నమ్మకం అన్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ. ఈరోజు(26.11.2018) మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ లో విలేకర్లతో మాట్లాడుతూ తాము సిద్ధం చేసిన పీపుల్స్ మ్యానిఫెస్టో ద్వారా ప్రజల్లోకి వెళ్తామన్నారు. “ప్రజా జీవనంలోకి రావడం అనేది ఖచ్చితమని, వచ్చే ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ లో పోటీలో ఉంటానని, ఆమేరకు త్వరలోనే ప్రకటన చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నాతో కలిసి నడిచేందుకు ఆమ్ ఆద్మీ – లోక్ సత్తా నేతలు అంగీకరించారని, ప్రజా జీవితంలోకి ఎలా వెళ్తాను అనేది త్వరలోనే ప్రకటిస్తానని అన్నారు. ఒంటరిగానా – లేదంటే నాతో కలిసి పనిచేసే వాళ్ళను కలుపుకొని వెల్తానా అనేది త్వరలో నిర్ణయిస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here