Home జాతీయ వార్తలు షార్‌ డైరెక్టర్‌గా పాండియన్‌

షార్‌ డైరెక్టర్‌గా పాండియన్‌

నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ అంత రిక్ష ప్రయోగ కేం ద్రం(షార్‌) డైరె క్టర్‌గా తమిళ నాడుకు చెందిన పాండియన్‌ను నియ మించారు. తమిళనాడులోని మహేంద్రగిరి లోగల ఇస్రో ఐపిఆర్‌సి డైరెక్టర్‌గా పని చేస్తున్న ఆయనను షార్‌కు డైరెక్టర్‌గా బదిలీ చేసారు. పాండియన్‌ మద్రాసు ఐఐటీలో ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌లో బిటెక్‌ చేసారు. బెంగుళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌లో ఎయిరోస్పేస్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసారు. 1984లో ఇస్రోలో శాస్త్రవేత్తగా విధుల్లో చేరి వివిధ హోదాలలో పనిచేసారు. రాకెట్లలో యూరోడైనమిక్‌ డిజైన్స్‌ రూపొం దించడంలో కీలకంగా పనిచేసారు. చంద్ర యాన్‌-1, మంగళయాన్‌ ఉపగ్రహాల ప్రయోగంలో సమర్ధవంతంగా విధులు నిర్వ ర్తించారు. చక్కటి విధినిర్వహణకు గాను ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. ఇప్పటివరకు షార్‌ డైరెక్టర్‌గా సేవలందిం చిన కున్హికృష్ణన్‌ బెంగుళూరులోని ఇస్రో శాటిలైట్‌ సెంటర్‌కు బదిలీ అయ్యారు. 2015జూన్‌లో షార్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కున్హికృష్ణన్‌ సారధ్యంలో మొత్తం 21రాకెట్‌ ప్రయోగాలు జరగడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here