Home జిల్లా వార్తలు శ్రీసిటీలో “స్మార్ట్ నగరాల్లో స్మార్ట్ భవనాలు” వర్కుషాప్ 

శ్రీసిటీలో “స్మార్ట్ నగరాల్లో స్మార్ట్ భవనాలు” వర్కుషాప్ 

స్మార్ట్ నగరాల్లో స్మార్ట్ భవనాలు అనే అంశంపై ఒక్క రోజు వర్కుషాప్ మంగళవారం శ్రీసిటీలో జరిగింది. ది కాన్ఫిడెరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ).  ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజిబిసి), స్వీడన్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (ఎస్ఐబిసి), శ్రీసిటీ సంయుక్తంగా దీనిని నిర్వహించారు. ఐజిబిసి అమరావతి చాప్టర్ మరియు ఎస్ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ సాయి మేకా మాట్లాడుతూ వర్కుషాప్ ఉద్దేశ్యాన్ని వివరించడంతో పాటు, శ్రీసిటీలో చేపడుతున్న గ్రీన్, స్మార్ట్ చర్యలను ప్రశంసించారు. స్వీడన్ ప్రభుత్వ అధికారి ఆల్బిన్ కార్లెన్, స్వీడిష్ స్మార్టుగ్రిడ్ ఉన్నతాధికారి మరియా సాన్డక్విస్ట్ మరింత క్షుణ్ణంగా వివరిస్తూ స్మార్ట్ బిల్డింగ్ టెక్నాలజీల ద్వారా భవనాల సామర్ధ్యం, భవనాల లోపల పర్యావరణ నాణ్యత ఎలా పెంపొందుతుందో తెలిపారు. 
 
శ్రీసిటీ ప్రారంభ దశ నుండే పరిశుభ్రత, పచ్చదనం, చక్కని పారిశ్రామిక నగర సముదాయాన్ని అందించే స్థిరమైన పర్యావరణ వ్యవస్థలను నెలకొల్పడానికి తాము నిబద్ధతతో ముందుకు సాగుతున్నట్లు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు. సుమారు 7500 ఎకరాల విస్తీర్ణం కలిగివుండి, ఐజిబిసి యొక్క గ్రీన్ సిటీ గోల్డ్ రేటింగ్ సాధించిన దేశంలోని మొదటి కొన్ని గ్రీన్ఫీల్డ్ నగరాల్లో శ్రీసిటీ ఒకటని ఆయన పేర్కొన్నారు. ఈ వర్కుషాప్ ద్వారా శ్రీసిటీ పరిశ్రమల యాజమాన్యాలకు తప్పక లాభం చేకూరుతుందన్నారు.
కాగా, గ్రీన్ బిల్డింగ్ మరియు స్మార్ట్ సిటీ కార్యక్రమం అమలుకు వీలు కల్పించడమే ఈ వర్కుషాప్ ప్రధాన లక్ష్యం. స్వీడన్ నుండి భవిష్యత్ గ్రీన్ టెక్నాలజీలపై అవగాహన కల్పించడంతో పాటు వారి ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతీయ ప్రాజెక్టులలో అమలు చేయడానికి మరియు ఆ రంగంలో నిపుణులతో పరస్పరం చర్చిండం దీని ఉద్దేశ్యం. చివరగా స్వీడిష్ కంపెనీల బృందం వారిచే గ్రీన్ టెక్నాలజీలో భాగమైన  రసాయనిక రహిత వాషింగ్, శక్తి నిల్వ, స్మార్ట్ మీటరింగ్ పరిష్కారాలు, లైట్ అర్బన్ వాహనాలు కొన్ని వస్తువులను ప్రదర్శించారు.
శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ ప్రారంభ ఉపన్యాసంతో మొదలైన వర్కుషాప్ లో స్వీడన్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ ఆరతి డేవిస్, ఐజిబిసి ప్రిన్సిపల్ కౌన్సిలర్ ఎస్.కార్తికేయన్, ఐజిబిసి, ఎస్ఐబిసి ఉన్నతాధికారులు, శ్రీసిటీ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here