Home జిల్లా వార్తలు శ్రీధర్ రెడ్డి ఆత్మీయ ప్రచారాలు

శ్రీధర్ రెడ్డి ఆత్మీయ ప్రచారాలు

నెల్లూరురూరల్ నియోజకవర్గ వైసీపి శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని అప్పుడే ప్రారంభించారు. ఆత్మీయ సమావేశాల పేరుతో వీధివీధికి వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా తన ప్రచారాన్ని స్థబ్ధుగా, చాపకింద నీరులా నిర్వహిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఇంటింటికి వెళ్లి వారింట్లో మనిషిలా వారి బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. సమస్యలు తెలుసుకుని అధికారులతో ఫోన్లో మాట్లాడి వీలైనంత వరకూ అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. అక్టోబర్ 31న మొదలుపెట్టిన ఈ ఆత్మీయ సమావేశాల జోరు 24రోజుల్లో 148 సమావేశాలకు చేరింది. నియోజకవర్గంలోని ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని నేరుగా కలుస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here