Home జిల్లా వార్తలు వ్యతిరేకత ఉన్నా.. వాళ్ళేనా?

వ్యతిరేకత ఉన్నా.. వాళ్ళేనా?

జిల్లాలో తెలుగుదేశంపార్టీకి మూడు అసెంబ్లీలున్నాయి. వైసిపి నుండి గోడ దూకిన గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌ను కలుపుకుంటే నాలుగు సీట్లవు తాయి. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ… అలాగే గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌… ఈ నలుగురిపై వారి వారి నియోజకవర్గాలలో వ్యతిరేకత వుంది. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ప్రజలకే కాదు, పార్టీ కార్య కర్తలు, నాయకులకు కూడా అందు బాటులో వుండడు. ఏ సమస్య చెప్పు కుందామన్నా వినే దిక్కుండదు. అదీగాక ఎమ్మెల్యే ప్రజల్లోకి రాడు. ఏదన్నా పని పడితే ప్రజలే ఎమ్మెల్యేను వెదుక్కుంటూ పోవాలి. ఆయన వ్యవహారశైలిపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితోనే వున్నారు. ఈసారి ఆయనకు సీటిస్తే గెలవడు అనే ప్రచారం కూడా వుంది. కాని ఆయనకు ప్రత్యామ్నాయంగా పార్టీలో కనిపిస్తున్న ఒకే ఒక్క అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి. రామారావు, కృష్ణారెడ్డిలలో ఎవరు బెటర్‌ అన్నది తేల్చాలి. కృష్ణారెడ్డి కన్నా రామారావే నయ మనుకుంటే మళ్ళీ ఆయనకే సీటు ఇవ్వక తప్పని పరిస్థితి.

వెంకటగిరిలో కురుగొండ్ల రామకృష్ణపై ఈసారి వచ్చినన్ని ఆరోపణలు గతంలో ఎప్పుడూ లేవు. చాలా వివాదాలు నడి చాయి. అయినా కూడా వెంకటగిరి తెలుగు దేశంలో కురుగొండ్లకు ప్రత్యామ్నాయ అభ్యర్థి కనిపించడం లేదు.

కోవూరులోనూ పరిస్థితి ఇదే విధంగా వుంది. కోవూరు సీటు కోసం ఈసారి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, పెళ్ళకూరు శ్రీనివా సులురెడ్డిలు పోటీలో వున్నారు. పోలంరెడ్డి కంటే ఆదాల బెటర్‌ అవుతాడు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేయకపోతే ఆయన మొగ్గుచూపనున్న అసెంబ్లీ సీటు కోవూరే! కాబట్టి ఆయన కోరుకుంటే ప్రాధాన్యత ఇవ్వక తప్పదు! ఆయన వద్దనుకుంటే పోలంరెడ్డి, పెళ్ళ కూరు శీనయ్యల మధ్య సీటు కోసం పోటీ వుంటుంది. పెళ్ళకూరు శీనయ్య ఈసారి సీటు కోసం గట్టిగా పట్టుబడుతున్నాడు. నియోజకవర్గంలో తన పట్టును పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే పోలంరెడ్డిని పక్కనపెట్టి చంద్రబాబు పెళ్ళకూరు ఎంత వరకు సీటిస్తాడన్నది సందేహం!

ఇక గూడూరు సీటు వైసిపి నుండి దూకి వచ్చాడు కాబట్టి పాశం సునీల్‌కు ఇవ్వక తప్పదు. సునీల్‌పై వ్యతిరేకత ఉందని తెలిసి కూడా ఎగ్గొట్టలేడు.

మొత్తానికి టీడీపీ సిటింగ్‌లను మార్చడం ఈసారి కష్టంతో కూడుకున్న పనే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here