Home జిల్లా వార్తలు వైసిపి వైపు.. పొణకా చూపు!

వైసిపి వైపు.. పొణకా చూపు!

గూడూరు పురపాలక ఛైర్‌పర్సన్‌ పొణకా దేవసేన, ప్రముఖ పారిశ్రామిక వేత్త పొణకా శివకుమార్‌రెడ్డిలు టీడీపీకి గుడ్‌బై చెప్పి వైకాపాలో చేరనున్నట్లు జోరుగా గూడూరు టౌన్‌లో ప్రచారం సాగుతోంది. ఈమేరకు పొణకా దంపతు లతో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మంతనాలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలోని ఓ మంత్రి వ్యవహార శైలిపై గుర్రుగా వున్న వీరు పార్టీని వీడే ఆలోచ నల్లో వున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రతిపక్ష పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి ద్వారా నేరుగా ఫోన్‌లో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. పొనకా దంపతులు వైకాపాలో చేరితే గూడూరులో తెలుగుదేశంపార్టీకి తీరని నష్టం జరిగే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గూడూరు అభివృద్ధికి పురపాలక సంఘ నిధులతో సంబంధం లేకుండా సొంత నిధులను సైతం వెచ్చించి పలు అభివృద్ధి పనులను చేపట్టి పట్టణ ప్రజల మన్ననలను పొం దారు పొణకా దంపతులు. ఈ క్రమంలో పార్టీ మారే విషయంలో అటు కౌన్సిలర్లతో పాటు ఇటు ప్రజల నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తోందని అంటున్నారు. ఛైర్‌పర్సన్‌ పదవి చేపట్టినప్పటి నుంచి ఎలాంటి మచ్చలేకుండా అభివృద్ధి పనులు చేస్తున్న పొణకా దేవసేన, పారిశ్రామికవేత్త పొణకా శివకుమార్‌రెడ్డిలు రాజకీయ భవిష్యత్తు కోసం ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా వారివెంటే నడిచేందుకు సిద్ధంగా వున్నట్లు పలువురు కౌన్సిలర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు సమా చారం. జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డిలు సైతం పార్టీలోకి రావాలని పొణకా దంపతులను కోరినట్లు సమాచారం. ఇదే జరిగితే రాబోవు ఎన్ని కల్లో గూడూరు టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here