Home గల్పిక వైసిపి ఎన్నికల ప్రచారంలో స్టైల్‌ ఆఫ్‌ సింహపురి

వైసిపి ఎన్నికల ప్రచారంలో స్టైల్‌ ఆఫ్‌ సింహపురి

ఐఆర్‌ 20-420 మున్సిపల్‌ కార్పొ రేషన్‌ ముదురుదోమలకు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు నగరం. సంతపేటలోని మాజీ మంత్రి, వెంకటగిరి వైసిపి అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి నివాసం. రాత్రి 10గంటలైంది. వెంకటగిరిలో ప్రచారం ముగించుకుని అప్పుడే ఆనం రామనారా యణరెడ్డి ఇంటికి చేరుకున్నాడు. స్నానం చేసి, కూడు తిని బెడ్‌రూమ్‌లోకి వెళ్లి నడుం వాల్చాడు. ఎదురుగా గోడకు వేలాడదీసిన అన్న, స్టైల్‌ ఆఫ్‌ సింహపురి ఆనం వివేకా(68) సిగరెట్‌ తాగుతూ స్టైల్‌గా వున్న ఫోటోను చూశాడు. రామనారాయణరెడ్డి కళ్లల్లో ఒక్క క్షణం నీళ్ళు… అన్న లేకుండా మేం చేస్తున్న తొలి ఎలక్షన్‌ ఇది… ఆయనే వుండుంటే ఇంకెంత బాగుండో… ఆయన వుండుంటే జిల్లా రాజకీయాలు ఇంకా ఎంతో కళకళ లాడుతుండేవనుకుంటూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు.

—–

పక్కరోజు వెంకటగిరిలో జాతర మాదిరిగా వుంది. ఎక్కడ చూసినా వైసిపి జెండాలే… వైసిపి అభ్యర్థిగా నామినేషన్‌ వేయడానికి ఆనం రామనారాయణరెడ్డి భారీ ర్యాలీతో తహశీల్దార్‌ ఆఫీసు వద్దకు వచ్చాడు. రిటర్నింగ్‌ అధికారి వద్దకొచ్చి నామినేషన్‌ పత్రాలు పూరించడం కోసం జేబులో చెయ్యి పెట్టాడు. పెన్ను లేదు, ఇదిగో తమ్ముడు ఈ పెన్‌తో ఫిలప్‌ చెయ్‌ అంటూ అప్పుడే ఓ చేయి ముందు కొచ్చింది. రామనారాయణకు ఆ పెన్ను ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఆ పెన్ను అందిస్తున్న వ్యక్తి ఎవరా అని వెనక్కి చూశాడు. అంతే కళ్ళు తిరిగి క్రింద పడిపోయాడు. పక్కనున్న కార్యకర్తలు బిత్తరపోయారు. వెంటనే నీళ్ళు తెచ్చి రామనారాయణరెడ్డి ముఖాన చల్లారు. ఆయన మెల్లిగా కళ్లు తెరిచాడు. ఇంతకు ముందు ఎవరినైతే చూసి అతను కళ్లు తిరిగి పడిపోయాడో ఆ వ్యక్తి అక్కడే వున్నాడు. అయితే ఈసారి రామనారా యణరెడ్డి కళ్లు తిరిగి పడిపోలేదు. ఆయన ముఖంలో ఆనందం, ఆశ్చర్యం.. వివేకన్నా… ఏందన్నా మీరిక్కడ… ఇది నిజమేనా? మీరేంటి మా ముందు ఇలా కనపడడమేంటి… ఇది కలకాదుగా అని తనను తాను గిల్లుకున్నాడు ఆనం రామ నారాయణరెడ్డి. కళ్ళకు నల్లద్దాలు పెట్టి, జుట్టుకు గ్రే కలర్‌ కొట్టి, జీన్స్‌ ఫ్యాంట్‌పై పోలో టీషర్ట్‌ వేసి స్టైల్‌గా వున్న వివేకా తనదైన స్టైల్‌లో సిగరెట్‌ వెలిగించి… తమ్ముడు ఇది మన సెంటిమెంట్‌ పెన్‌, నువ్వు ఇంటి దగ్గర మరచిపోయి వచ్చావ్‌, దీంతో నామినేషన్‌ ఫారమ్‌ రాయి… గెలుపు గ్యారంటి అని చెప్పాడు. అందుకు రామనారాయణ… గెలుపు సంగతి తర్వాత… ముందు ఇది చెప్పు… ఇక లేవు… కానరావు అనుకున్న మీరు ఇలా ఎలా వచ్చారో అర్ధం కావడం లేదు. చరిత్రలో ఇదో అద్భుతం, ఎలా సాధ్య మైందని అడిగాడు. దానికి వివేకా… రాత్రి పడుకోబోయే ముందు నువ్వు నన్ను తలచుకుని కన్నీళ్లు పెట్టడం, నేను లేకుండా తొలిసారి నామినేషన్‌ వేస్తుం డడంపై బాధపడడం పైనుండి చూసాను. ఎలాగైనా నీ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనాలనిపించింది. దేవేంద్రుడికి ఈ విషయం చెప్పాను. ఆయన మొదట ఒప్పుకోలేదు… వెంటనే నేను దేవేంద్రుడికి వ్యతిరేకంగా ఒక గ్రూపును తయారుచేసి, ఆయనను గద్దెదించాలని, అక్కడ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి అధిపతిని ఎన్నుకోవాలని

ఉద్యమం మొదలుపెట్టాను. నా దెబ్బకు తట్టుకోలేక ఇంద్రుడు తన లోకం రాజ్యాం గాన్ని సవరించి స్పెషల్‌ పర్మిషన్‌ క్రింద ఎలక్షన్‌లు అయ్యేదాకా ఇక్కడే వుండమని చెప్పి పంపించాడు అని చెప్పాడు. దాంతో రామనారాయణ… ఈ పది రోజులు నువ్వు నా పక్కనుంటే… ప్రత్యర్థు లతో చెడుగుడు ఆడుకుంటానన్నా… అని ఉత్సాహంగా చెప్పాడు. నామినేషన్‌ తర్వాత వివేకా నియోజకవర్గమంతా ప్రచారం చేశాడు. ఆ తర్వాత జిల్లాలో 9అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో కలిసి ప్రచారం చేశాడు. అభ్యర్థులకంటే కూడా జనం వివేకాను చూడడానికి ఎగబడసాగారు. వివేకా ప్రచారం, అసలే బలంగా వున్న వైసిపిలో ఇంకా జోష్‌ పెంచింది. కావలిలో జగన్‌ బహిరంగ సభలోనూ వివేకా పాల్గొన్నాడు. విజయ సాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పి.అనిల్‌ కుమార్‌ లాంటి వారితో వివేకా… స్టేజీ మీదే పాత జ్ఞాపకాలను నెమరు వేసు కుంటూ ముచ్చట్లు పెట్టుకున్నాడు. జగన్‌కు జనంలో ఎంత రెస్పాన్స్‌ వుందో వివేకాకు అంతకంటే ఎక్కువ రెస్పాన్స్‌ రాసాగింది. దీంతో జగన్‌… అన్నా, రాష్ట్రమంతా కూడా మీరు నాతో పాటు పర్యటించం డని వివేకాను అడిగాడు. వివేకా దానికి… నాకు అంతకంటే అవకాశమా, మీకు ప్రచారం చేసి గతంలో నా వల్ల జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటా నన్నాడు.

తర్వాత అన్ని నియోజకవర్గాలలో జగన్‌తో పాటు వివేకా కూడా పాల్గొని చంద్రబాబును తనదైన శైలిలో ధుమ్మెత్తి పోయసాగాడు. రాష్ట్ర వ్యాప్తంగా వివేకా ప్రభావంతో వైసిపికి ఇమేజ్‌ పెరగగా తెలుగుదేశం డామేజ్‌ కాసాగింది.

—–

ఢిల్లీలోని ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం. ఎలక్షన్‌ కమిషనర్‌ సునీల్‌ అరోరా ఛాంబర్‌లో హైటెక్‌రత్న చంద్ర బాబు, నారా లోకేష్‌, మంత్రులు పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, కళా వెంకట్రావ్‌, దేవినేని ఉమ ఇంకా కొందరు తెలుగుదేశం నాయకులు న్నారు. మీ కంప్లైంట్‌ ఏంటి అని సునీల్‌ అరోరా అడిగాడు. చంద్రబాబు ఆవే శంగా, ఉండదాండి… బాధ అనిపించ దాండి.. రక్తం పొంగిపోతుంది… వీళ్ల సంగతి తేలుస్తా అంటూ అరవసాగాడు. సునీల్‌ అరోరా జోక్యం చేసుకుని ఇది అసెంబ్లీ కాదు, చెప్పాల్సిన విషయం నేరుగా చెప్పండని కోరాడు. చంద్రబాబు దానికి… సార్‌, ఎక్కడైనా ఈ భూమ్మీద వున్న మనుషులు ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారం చేయడం చూసాం. కాని చచ్చిపోయి స్వర్గానికి పోయినోళ్లు కూడా వచ్చి మా రాష్ట్రంలో వైసిపి తరపున ప్రచారం చేస్తున్నాడు. ఇది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనే కదా… అయినా ఆ దేవేం ద్రుడికైనా ఆలోచన లేదా… ఇది ముమ్మా టికీ నరేంద్రమోడీ పనే… ఈ నరేంద్ర మోడీతో ఆ దేవేంద్రుడు కుమ్మక్కై ఇలా వివేకాను పంపించాడు. రామనారాయణ రెడ్డి ఫోటో చూస్తూ తన అన్నను తలచు కునేసరికి పక్కరోజు వివేకా వచ్చాడంట… ఈరోజు జగన్మోహన్‌రెడ్డి పడుకోబోయే ముందు తన తండ్రి ఫోటోను చూస్తూ తలచుకుంటే రేపు వై.యస్‌. రాజశేఖరరెడ్డి వస్తే మా పరిస్థితేంటి… కాబట్టి వెంటనే వివేకాను ఆయన లోకానికి పంపించే ఏర్పాట్లు చేయండి… ఇలా చనిపోయిన వాళ్లందరూ తిరిగొచ్చి ప్రచారం చేస్తుంటే మా పరిస్థితేం కావాలి అని ఆవేశంగా చెప్పాడు. అంతలో లోకేష్‌ హఠాత్తుగా ‘డాడీ’ అంటూ గట్టిగా అరిచాడు. చంద్రబాబు అదిరిపడి… ఏమైందిరా అని అడిగాడు. నాకు సూపర్‌ ఐడియా వచ్చిం దని లోకేష్‌ చెప్పాడు. ఏంటో చెప్పు అని బాబు అడిగాడు. దానికి లోకేష్‌… ఈ రాత్రి మీరు నిద్రపోయే ముందు తాత నందమూరి తారకరామారావు ఫోటోను చూస్తూ ఆయనను తలచుకుని నిద్ర పోండి… రేపు ఉదయం తాతయ్య వస్తాడు… ప్రచారంలో ప్రభంజనం సృష్టిస్తాడు అని చెప్పాడు. ఆ మాట వినగానే చంద్రబాబు ఠక్కున అక్కడే టేబుల్‌పై వున్న ఫైళ్ళను తీసుకుని లోకేష్‌ తలపై వాయిస్తూ… అసలే డూప్లికేట్‌ ఎన్టీఆర్‌ వుండే ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాకే భయపడి చస్తుంటే, నువ్వు ఒరిజినల్‌ ఎన్టీఆర్‌నే తీసుకొచ్చే ప్లాన్‌ చేస్తావా… ఆయన వచ్చి నిజాలు చెప్పాడంటే మన బ్రతుకు మంగళగిరి మాన్యమే… అని కొట్టసాగాడు.

ఆ సీన్‌ కళ్లపై కదలాడుతుండ డంతో… హా హా హా అంటూ ఆనం రామనారాయణరెడ్డి నిద్రలోనే నవ్వ సాగాడు. అప్పుడే తెల్లారడంతో తన బాస్‌ను లేపడానికి అక్కడికొచ్చిన పి.ఏ అష్రాఫ్‌… తన బాస్‌ నిద్రలోనే నవ్వడాన్ని చూసి ముఖంపై నీళ్ళు చల్లాడు. చల్లగా నీళ్ళు పడడంతో రామనారాయణరెడ్డి

ఉలిక్కిపడి లేచాడు. చుట్టూ చూసాడు. అప్పటిదాకా జరిగింది కల అని తెలుసు కోవడానికి ఆయనకు అరగంట పట్టింది. రాత్రి పడుకునే ముందు అన్న వివేకాను తలచుకున్నానో లేదో… ఇట్టే కలలోకి వచ్చి ఆశీర్వదించాడని సంబరపడుతూ ప్రచా రానికి పోవడానికి లేచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here