Home జిల్లా వార్తలు వైసిపిలో మ్యూజికల్‌ ఛైర్‌

వైసిపిలో మ్యూజికల్‌ ఛైర్‌

మ్యూజికల్‌ ఛైర్‌ అనే ఆట గురించి అందరికీ తెలిసే వుంటుంది. మూడు కుర్చీలు వేసుంటారు. నలుగురు వాటి చుట్టూ తిరుగుతుంటారు. మ్యూజిక్‌ ఆగిపోగానే ఎవరికి దొరికిన కుర్చీలలో వాళ్ళు కూర్చోవాలి. మూడు కుర్చీలే కాబట్టి నాలుగోవాడు బయటకు పోక తప్పదు. ఇప్పుడు జిల్లాలోని వైసిపిలో కూడా అలాంటి మ్యూజికల్‌ ఛైర్‌ ఆటే నడుస్తోంది.

నెల్లూరు లోక్‌సభ, ఆత్మకూరు, వెంకటగిరి, ఉదయగిరి అసెంబ్లీలు… మొత్తం నాలుగు సీట్లు… మేకపాటి రాజ మోహన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి… ఆ నాలుగు సీట్లకు పోటీ పడబోతున్న ఐదుగురు నాయకులు. ఆనం రామనారా యణరెడ్డి వైసిపిలో చేరే పని లేకుంటే ఈ సమస్య వుండేది కాదు. ఆయన చేరు తుండబట్టే ఎవరికి సీటు కోతేయాలన్న ప్రశ్న వస్తోంది.

ఈ సమస్యకు వైసిపి అభిమానులు, కార్యకర్తలు సూచిస్తున్న పరిష్కారం… ఒకే కుటుంబానికి మూడు టిక్కెట్లు అవసరమా? మేకపాటి కుటుంబానికి రెండు టిక్కెట్లే ఇస్తే సమస్య పరిష్కారమవుతుందంటున్నారు. మరి ఎవరికి కోత వేయాలన్నది కూడా ఇక్కడ సమస్యే! నాది చివరి ఎలక్షన్‌ అని రాజమోహన్‌రెడ్డి అంటున్నాడు. అదీగాక మొన్న ప్రత్యేకహోదా డిమాండ్‌తో రాజీ నామా చేసిన క్రెడిట్‌ కూడా వుంది. ఆత్మకూరును నేనెందుకు వదులుకుంటా నని గౌతం అంటున్నాడు. 2014 నుండి ఉదయగిరి ఇన్‌ఛార్జ్‌గా పార్టీని నడిపిస్తు న్నాను, ఇప్పుడు సీటు లేదంటే నేనెందుకు వూరుకుంటానని మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అంటున్నాడు. వెంకటగిరిలో ఎవరూ లేనప్పుడు పార్టీకి అండగా నిలిచాను, నాకెందుకు సీటివ్వరు అని బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి వాదన. సీటిచ్చి పోటీ చేయించే ఉద్దేశ్యం లేనప్పుడు రామనారా యణరెడ్డిని పార్టీలోకి తీసుకోవడం దండగ.

ఈ సమస్య పరిష్కారానికి కొన్ని మార్గాలు వున్నాయి. మేకపాటి రాజ మోహన్‌రెడ్డిని రాజ్యసభకో లేదా నరసా రావుపేట లోక్‌సభకో పంపించి, నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా ఆనంను దించడం. లేదంటే ఒక లోక్‌సభ, ఒక అసెంబ్లీకి మేకపాటి కుటుంబాన్ని పరిమితం చేసి ఆనంకు సీటివ్వడం. మేకపాటి కుటుం బానికి ఒక సీటు తగ్గిస్తే బొమ్మిరెడ్డికి పోటీకి ఛాన్స్‌ వుంటుంది. దీనివల్ల పార్టీకి మేలే జరుగుతుంది. ఈ నాలుగు సీట్ల విషయంలో పార్టీ అధిష్టానం లోతుగా దృష్టిపెడితే అభ్యర్థుల ఎంపిక పెద్ద కష్టం కాకపోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here