Home జిల్లా వార్తలు వైసిపిని వీడిన బొమ్మిరెడ్డి

వైసిపిని వీడిన బొమ్మిరెడ్డి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదనుకుంటున్న నెల్లూరు జిల్లాలో ఆ పార్టీకి మొదటి షాక్ తగిలింది. నెల్లూరుజిల్లా ప్రజాపరిషత్ ఛైర్మెన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించాడు. జగన్ నియంత పోకడ వల్లే తాను పార్టీ వీడుతున్నట్లు ఆయన ఈరోజు(22.09.2018) జడ్పీ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించాడు. 2014లో జిల్లా పరిషత్ ఛైర్మెన్ గా తీవ్ర ఉత్కంఠ, ఒత్తిడుల మధ్య ఎన్నికైన బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గత నాలుగున్నరేళ్లుగా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్తగా కూడా వ్యవహరిస్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో వెంకటగిరి అసెంబ్లీ నుండి వైసిపి అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆనం రామనారాయణరెడ్డి వైసిపిలో చేరడం, తనతో చర్చించకుండానే ఆయనను వెంకటగిరి సమన్వయకర్తగా ప్రకటించడం రాఘవేంద్రరెడ్డిని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ఇటీవల వైజాగ్ లో జరిగిన సమన్వయకర్తల సమావేశానికి కూడా ఆయనను పిలవకపోవడం బాధించింది. రామనారాయణరెడ్డిని అధికారికంగా వెంకటగిరికి సమన్వయకర్తగా ప్రకటించిన నేపథ్యంలో రాఘవేంద్రరెడ్డి పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఆయన భవిష్యత్ లో ఏ పార్టీలో చేరేది ఇంకా ప్రకటించలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here