Home జిల్లా వార్తలు వైకాపాలోకి భారీగా చేరుతున్న జనం – త్వరలో ‘తటస్థుల దీవెన’కు శ్రీకారం –...

వైకాపాలోకి భారీగా చేరుతున్న జనం – త్వరలో ‘తటస్థుల దీవెన’కు శ్రీకారం – ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో ఇటీవలి కాలంలో వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీలోకి చేరుతున్న ప్రజల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఇది నెల్లూరు రూరల్‌లో తమ పార్టీ విజయానికి సూచన అని రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. పొదలకూరురోడ్డు డివిజన్‌కు చెందిన కారూరి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు 150 మంది మిత్రబృందాలవారంతా కలసి ఈ నెల 5న ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సమక్షంలో వైకాపాలోకి చేరారు. వారందరికి ఆయన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో ఏపార్టీలో చేరకుండా తటస్థంగా ఉన్న వారంతా పెద్దఎత్తున వైకాపాలో చేరేందుకు ముందుకు రావడం తనకెంతో సంతోషంగా ఉందని, ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులు, యువకులు, మహిళలు పెద్దసంఖ్యలో పార్టీలోకి వస్తున్నారని, ఈసారి వచ్చే ఎన్నికల్లో అందరం మీకు మద్దతుగా పనిచేస్తామంటూ తమ ముందుకు వస్తున్నారని అన్నారు. అందుకే తటస్థులందరి దీవెనలతో త్వరలో భారీ కార్యక్రమం చేపట్టేందుకు సమాయత్తమవుతున్నామని, అన్ని ప్రాంతాల్లో కూడా ఇదేవిధగా ‘తటస్థుల దీవెన’ కార్యక్రమం చేపడతామని, ఇప్పటికే సుమారు 3వేల కుటుంబాలు వైకాపాలో చేరేందుకు పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. వైకాపా కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చెయ్యడమే కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాలుపంచుకోవాలని, ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోవాలని, పార్టీకి..తమకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here