Home జిల్లా వార్తలు వేగవంతంగా ‘నెక్లెస్‌’ తయారీ!

వేగవంతంగా ‘నెక్లెస్‌’ తయారీ!

ఎన్నో ఏళ్ళుగా ప్రచారానికే పరిమితమైన నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద నెక్లెస్‌ రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ నెలలోనే ఈ రోడ్డును ప్రారంభించాలనే లక్ష్యంతో రాత్రింబవళ్ళు పనిచేయిస్తున్నారు. నుడా ఛైర్మెన్‌ కోటంరెడ్డి శీనయ్య దీనినొక ధ్యేయంగా పెట్టుకుని పనులను పరుగుపెట్టిస్తున్నారు. ఇరుకళలమ్మ గుడి నుండి బారాషహీద్‌ దర్గా దాకా నెక్లెస్‌ రోడ్డు నిర్మాణం రూపుదిద్దుకుంటోంది. ఇక్కడ పార్కులు, సైకిల్‌, వాకింగ్‌ ట్రాక్‌లు, ఫుడ్‌కోర్టులు, ఫంక్షన్‌ హాల్స్‌, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియాలు ఏర్పాటు చేస్తు న్నారు. అలాగే అంతా పూర్తయ్యాక ప్రముఖుల విగ్రహాలు కూడా నెక్లెస్‌రోడ్డుపై పెట్టబోతున్నారు. తొలివిడత నెక్లెస్‌రోడ్డు పూర్తయ్యాక రెండవ విడతలో ఇరుకళలమ్మ గుడి నుండి పొట్టేపాళెం వద్ద హనుమాన్‌ జంక్షన్‌ వరకు చెరువుకట్టను ట్యాంక్‌బండ్‌గా మార్చే ప్రతిపాదన కూడా వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here