Home రాష్ట్రీయ వార్తలు వేంకటరమణుడి సాక్షిగా.. ఏడుకొండలపై… శ్రీనివాసుడే రాజు

వేంకటరమణుడి సాక్షిగా.. ఏడుకొండలపై… శ్రీనివాసుడే రాజు

తిరుమలలో ఆయన చెప్పిందే వేదం. ఆయన చేసిందే శాసనం. ముఖ్యమంత్రిని కూడా ఈయన ఖాతరు చేయడు. మంత్రులనైతే అసలే పట్టించుకోడు. ఇక యం.పిలు, యం.యల్‌.ఏలూ అంటే ఏ స్థాయిలో చూస్తాడో మనం ఆలోచించుకోవచ్చు. బడా పారిశ్రామికవేత్తల అడుగులకు మడుగులొత్తుతాడు. ముఖ్యంగా ”ఢిల్లీ” సుప్రీంలకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. సుప్రీంలను భూతంలా చూపి ముఖ్యమంత్రులను సైతం బ్లాక్‌మెయిల్‌ చేస్తాడు. తిరుమలలో దర్శన టిక్కెట్ల విషయంలో ఈయన గీసిందే గీటు. ప్రోటోకాల్‌ అన్న పదానికి అర్ధాన్నే మార్చేసిన ఘనత ఈ అధికారిది.

2011లో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆయన సోదరుడు నల్లారి కిషోర్‌ ఆశీస్సులతో తిరుమలలో పాదం మోపిన తిరుమల జె.ఇ.ఓ శ్రీనివాసరాజు ఇక ఆరోజు నుండి ఈరోజు వరకు ఎదురులేని మనిషిగా కొనసాగుతున్నాడు. కేవలం రెండేళ్ళ కాల పరిమితితో డెప్యూటేషన్‌పై వచ్చిన ఈ పెద్దమనిషి అప్పటినుండి ప్రతీ రెండేళ్ళూ పొడిగించుకోవడంతో తనకున్న ఢిల్లీ పవర్‌ నంతా వాడి సఫలమౌతూ వస్తున్నాడు. సాంబశివరావు వంటి ఎగ్జిక్యూటివ్‌ అధికారి మినహా మిగిలిన ఇ.ఓలు కూడా శ్రీనివాసరాజు ముందు డమ్మీలుగా విధులు నిర్వహించే పరిస్థితికి తీసుకొచ్చాడు.

చీమ చిటుక్కుమన్నా భూతద్దంలో వార్తలు వేసి విశ్లేషణలు చేసే మీడియా సైతం శ్రీనివాసరాజుకు మోకరిల్లిందంటే ఆయన చాణుక్యత చతురత ఏ స్థాయిలో వుంటుందో ఊహించుకోవచ్చు. నమో ఏడుకొండల వాడా వేంకటరమణా గోవిందా గోవిందా అంటూ ఆథ్యాత్మిక తత్వంతో తిరుమలలో అడుగుపెట్టిన ఆయన ప్రస్థానం ఆథ్యాత్మికత పరాకాష్టకు చేరి అహంకారంగా మారిందంటే ”ఢిల్లీ” సుప్రీంల ఆశీస్సులు ఆయనను ఏ స్థాయికి తీసుకెళ్ళాయో మనం ఊహించుకోవచ్చు. ఆయన సారధ్యంలో నిజమైన భక్తికి స్థానం లేదు. ఆ శ్రీ వేంకటేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలంటే ముందుగా ఈ శ్రీనివాసుని దయ తప్పదన్న స్థాయికి ఆయన పలుకు బడిని పెంచేసుకున్నాడు.

ఎవరి పరువు..ఎవరికి నష్టం?

ఇటీవల అత్యంత వివాదాస్పదమైన అంశంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘వజ్రం’ వివాదంలో వైసిపి యం.పి. విజయసాయిరెడ్డి మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులపై 200కోట్లకు పరువు నష్టం దావా వేయించి టిటిడికి చెందిన స్వామివారి నిధి నుండి 2కోట్ల 14లక్షల రూపాయలు కోర్టు ఖర్చుల క్రింద జమ చేయించగలిగాడంటే ఈ అధికారి పలుకుబడి గురించి మనం ప్రత్యేకంగా చర్చించు కోవాలసిన అవసరం లేదు.

అసలు పరువు ఎవరికి పోయింది? భగవంతుడికా..? ఒకవేళ భగవంతుడికైతే ఆయన పరువు విలువ 200కోట్లేనా..? లేదా ట్రస్టుబోర్డు పరువు పోయిందను కుంటే… అందుకు స్వామివారి డబ్బులు ఎలా వాడతారు? అదీకాదు… పోయింది ప్రభుత్వ పరువో లేక జె.ఇ.ఓ, ఇ.వో, ఛైర్మెన్‌ల వ్యక్తిగత పరువో అయితే దీనికి స్వామివారి డబ్బుకి ఏం సంబంధం. ఈ ప్రశ్నలన్నింటికీ ఈ రాజావారే సమాధానం చెప్పాలి. ఓ వైపు ముఖ్యమంత్రిని ”ఢిల్లీ” నుండి సిఫారసుల ద్వారా బెదిరిస్తూ మరో వైపు చిన్నబాబుని ప్రసన్నం చేసుకునే దిశగా పావులు కదుపుతూ పశ్చిమగోదావరి జిల్లాకు కలెక్టర్‌గా వెళ్ళాలని, అక్కడి నుండి మళ్ళీ ఇవోగా స్వామివారి చెంతకు రావాలనే ప్రయత్నం చేస్తూనే, కుదిరితే రాజకీయ రంగ ప్రవేశం చేసి ”నగరి” నియోజకవర్గం నుండి పోటీ చేయాలనే ఆలోచనలో కూడా వున్నట్లు సమాచారం.

తన జాతకం ప్రకారం రాజకీయా లలో రాణిస్తానని, గెలిచి మంత్రిని కూడా అవుతానని తన వ్యక్తిగత జ్యోతిష్కులు చెప్తున్నారని తన అనుంగ మిత్రుల దగ్గర తరచూ చెప్పుకుంటూ ఆ దిశగా ప్రయ త్నాలు సాగిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన గొంతెత్తితే కోయిల గానం, ఆయన రాగం తీస్తే అన్నమయ్య కీర్తన అంత పవిత్రంగా ఆయన మాటలను చూస్తున్న మీడియా మిత్రులు, టిటిడి అధికార యంత్రాంగం బాబు పాలనలోని నేతలూ ఆయనకు వంత పాడుతుండడంతో ఈయన ఆడంబ రానికి, ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. ఓసారి ఈయన గత చరిత్ర, కాలేజీ రోజులూ, వ్యక్తిగత జీవితాలను పరిశీలిస్తే కళ్ళు బైర్లు కమ్మే నిజాలు తెలుస్తున్నాయి. అవన్నీ ఇక్కడ ప్రస్తుతానికి అప్రస్తుతం కాబట్టి మరో సందర్భంలో ముచ్చటించుకుందాం.

ఈయన లీలలపై దర్యాప్తు చేయాలి..

– భానుప్రకాష్‌ ఫిర్యాదు

గత సెప్టెంబర్‌ 27వ తేదీన జె.ఇ.ఓ జరిపిన ఆకస్మిక తనిఖీలో శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన టిక్కెట్లలో భారీ అవకతవకలు జరిగినట్లు రుజువైంది. ఈ అవకతవకలలో 16మందిని దోషులుగా గుర్తించారు. అయితే ఆ 16మంది ఎవరో, వారి పేర్లు ఏమిటో బయట పెట్టాలని టిటిడి బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాష్‌ ఇటీవల జిల్లా యస్‌.పి.ని కూడా కలిసి ఫిర్యాదు చేశాడు. అవసరమైతే సిబిసిఐడి చేత ఎంక్వయిరీ చేయించాలని కూడా ఆయన డిమాండ్‌ చేశాడు. తిరుమల ఆథ్యాత్మిక కేంద్రమా లేక దళారీల నిల యమా అని కూడా భాను ప్రశ్నించాడు.

తమది పారదర్శక ప్రభుత్వం, నిజా యితీ ప్రభుత్వం, ఎవ్వరికీ భయపడని ప్రభుత్వం అంటూ ఎప్పుడూ ఎదుటవారిని వేలెత్తి చూపించే చంద్రబాబు ఈ అధికారి విషయంలో మాత్రం ఎందుకు తోక ముడి చాడో ఆయనకే తెలియాలి. ఎవరికైనా వ్యక్తిగత మొహమాటాలు వుంటాయి,

ఉద్యోగ పరిమితులూ ఉంటాయి. హోదాకి తగ్గట్లుగా గౌరవమూ ఉంటుంది. కాని, వీటన్నింటినీ హక్కుగా వాడుకుంటూ తిరుమల అంటే తానే, ”శ్రీనివాసుడు” అంటే తానే అన్నట్లుగా వ్యవహరిస్తే ప్రభు త్వాలు, పాలకులు మౌనం వహిస్తారేమో తప్ప, ఆ దేవదేవుడు మాత్రం క్షమించడు. ఓం నమో వేంకటేశాయ నమః!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here