Home జాతీయ వార్తలు వెంకయ్య ప్రచారం లేని తొలి ఎన్నికలు

వెంకయ్య ప్రచారం లేని తొలి ఎన్నికలు

1978 నుండి 2019… దాదాపు నలభై ఏళ్ళు… ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి, మొన్నటి బీజేపీ జాతీయ నాయకుడు యం.వెంకయ్యనాయుడు ప్రమేయం లేకుండా, బీజేపీ తరపున ఆయన ప్రచారం లేకుండా ఈ నలభై ఏళ్ళ కాలంలో జరుగుతున్న తొలి ఎన్నికలివి. జాతీయ రాజకీయా లలోనే కాదు, బీజేపీకి కూడా ఇదో పెద్ద లోటు. ఎన్నికలు వచ్చాయంటే వెంకయ్యనాయుడు కంచు కంఠం గణగణ మోగుతుండేది. అతను విమానాలెక్కిపోవడం కాదు, ఆయనే రెక్కలు కట్టుకున్న విమానంలాగా తిరుగుతుండేవాడు. పొద్దున కాశ్మీర్‌లో వుంటే, మధ్యాహ్నం మధ్యప్రదేశ్‌లో, సాయంత్రం సిక్కింలో, రాత్రికి రాజస్థాన్‌లో… ఇలా ఒకే రోజులో దేశం లోని నలువైపుల ప్రాంతాలలో వుండేవాడు. నాలుగుచోట్ల ప్రెస్‌మీట్‌లు పెట్టి ఆ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలనే ప్రస్తావించేవాడు. వాయిస్‌ ఆఫ్‌ ది బీజేపీగా మారి పార్టీ వాణిని దేశం నలుమూలలా ప్రతిధ్వనింపజేస్తుండేవాడు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, ఏ సీటు ఎవరికి ఇవ్వాలనే దానిపై లోతుగా అధ్యయనం చేసేవాడు. ఢిల్లీలో వున్నా అన్ని రాష్ట్రాలలో గల్లీ స్థాయి రాజకీయాలను నిశితంగా పరిశీలించేవాడు. 1978 నుండి 2019 వరకు చూస్తే నేటి ఎన్నికలను కలుపుకుని 1978, 1985, 1989, 1991, 1996, 1998, 1999, 2004, 2009, 2014 పదిసార్లు భారత పార్లమెంట్‌ ఎన్నికలు జరిగాయి. ఈ అన్ని ఎన్నికలలోనూ వెంకయ్య చురుకైన పాత్ర పోషించారు. అలాంటి వెంకయ్య తన రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఈ ఎన్నికలకు దూరంగా వుంటున్నారు. ఉపరాష్ట్రపతి అనే రాజ్యాంగ హోదా ఆయన మనసుకు కళ్లెం వేస్తుంది. ఇప్పటివరకు బీజేపీ నేతగా ఆ పార్టీ గెలుపోటములలో ప్రత్యక్ష భాగస్వామి అయిన వెంకయ్య, ఈ ఎన్నికలకు మాత్రం ప్రేక్షకపాత్రధారి అయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here