Home గ్రామ సమాచారం వెంకటగిరి టీడీపీ మెడకు… గుదిబండలా మారిన రాపూరు

వెంకటగిరి టీడీపీ మెడకు… గుదిబండలా మారిన రాపూరు

ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా రాపూరు పోలీసుస్టేషన్‌పై దళితుల దాడి వెంకటగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద సమస్యగా మారింది. ఇది రాష్ట్ర స్థాయి ప్రచారాంశంగా తయారైంది. ఓ పక్క దళిత సంఘాల నాయకులు రోజుకొకరొస్తు న్నారు. పోలీసు శాఖపై దుమ్మెత్తిపోసి పోతున్నారు. మరోపక్క పోలీసు శాఖకు కూడా ఇది సవాలే! పోలీసు సంఘాల వాళ్ళు పోలీసు సిబ్బందిపై దళిత సంఘాల నాయకులు చేస్తున్న విమర్శ లను తిప్పికొడుతున్నారు. అటు దళితులకు ఇటు పోలీసులకు మధ్య ఇది రగులుతూనే వుంది.

ఈ సమస్య ఇంతగా రగలడానికి కారణం… అధికార పార్టీలో ఈ సమస్యను ఆదిలోనే చల్లార్చే నాయకుడు లేకపోవడం. మంత్రి నారాయణ వుంటే ఆయనకు ఇలాంటివాటిలో అనుభవం లేదు. రాజకీయంగా కాకలు తీరినవాళ్ళే ఇరువర్గాల వారిని ఒకతాటిపైకి తెచ్చి పరిష్కరించగలరు. జిల్లాకు చెందిన మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి ఈ సమస్యను అప్పగించి వుంటే రెండురోజుల్లోనే దీనిని దారికి తెచ్చుండేవాడు. కాని జిల్లాపై మంత్రి నారాయణకు ఇచ్చినంత అధికారం చంద్రబాబు సోమిరెడ్డికి ఇవ్వలేదు. కాబట్టే అన్ని విషయాల లోనూ ఆయన కలుగజేసుకోలేకపోతున్నాడు.

సంఘటన జరిగిన రోజు నుండి కూడా రోజుకొకరు రాపూరుకు వచ్చి సమస్యను ఇంకా పెద్దది చేసారు. తీరా ఇప్పుడది తెలుగుదేశం పార్టీ మెడకే గుదిబండలా అయ్యింది. ఇక్కడ పరిస్థితి కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా మారింది. ఈ సంఘటనలో ప్రతిపక్ష వైసిపి నాయ కులు దళితుల పక్కన నిలబడ్డారు. అధికార తెలుగుదేశం మాత్రం అటు దళితుల వైపు పూర్తిగా నిలబడలేకపోతోంది. ఎందుకంటే ఈ సంఘటనలో ప్రధాన కారకుడైన ఎస్‌.ఐ లక్ష్మణరావు సామాజికవర్గానికి చెందిన వాళ్ళు వెంకటగిరి పట్టణంలో ఎక్కువ. వీరంతా కూడా మొదటి నుండి తెలుగుదేశం మద్దతు దారులే! ఈ వర్గీయులు ఇప్పటికే ఎస్‌.ఐకు అనుకూలంగా మద్దతు కూడగట్టారు. ఎస్‌ఐను కాపాడుకోవడానికి తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఎమ్మెల్యే రామకృష్ణ పట్ల వున్న వ్యతిరేకతతో వెంకటగిరిలో తెలుగుదేశం పార్టీ బలహీ నంగా మారుతోంది. ఈ సంఘటన ప్రభావం కూడా ఆ పార్టీపై అధికంగానే వుండబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here