Home జిల్లా వార్తలు వెంకటగిరిలో ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆనం

వెంకటగిరిలో ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆనం

ఈరోజు(నవంబరం 9)న వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు మండలం పెంచలకోనలోని శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుండి మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరి నియోజకవర్గ పర్యటనకు శ్రీకారం చుట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయభేరి సదస్సుపేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వెంకటగిరి, సైదాపురం, డక్కిలి, బాలాయపలి్ల, కలువాయి, రాపూరు మండలాల నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ఆనం అభిమానులు తరలివచ్చారు. పెంచలకోన దేవస్థానంలో పూజలు నిర్వహించిన అనంతరం అక్కడే నిర్వహించిన సదస్సులో మంత్రి ఆనం రామణారాయణరెడ్డితో పాటు మాజీఎంపి వరప్రసాద్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నుండి పెంచలకోనకు బయలుదేరిన ఆనంకు, పొదలకూరు, రాపూరు మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ర్ట అభివృద్ధి కోసం 2019లో వైసిపిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనావుందన్నారు. జగన్ ప్రజాదరణ చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనపై హత్యాయత్నాలకు సైతం ఒడిగడుతున్నారని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here