Home నెల్లూరులో నేడు వీధుల్లో గబ్బు.. పొంచివున్న జబ్బు

వీధుల్లో గబ్బు.. పొంచివున్న జబ్బు

పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకి దిగి నెలరోజులు కావొస్తుంది. 279 జి.ఓను రద్దు చేయాలంటూ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమించే దిశగా పాలకులు ఇంతవరకు ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. మొన్న జరిగిన నెల్లూరు కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలోనూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నెల్లూరు నగర వీధుల్లో టన్నుల కొద్ది చెత్త పేరుకుపోయింది. చెత్త ఒకట్రెండు రోజులు ఎత్తకపోతేనే కుళ్లు కంపు కొడుతుంది. అలాంటిది నెలరోజులుగా ఒకేచోట చెత్త వుంటే పరిస్థితి ఏంటి? చాలా దారుణంగా వుంది. వీధులు దుర్గంధంగా మారాయి. ఆ వీధుల్లో వెళ్లాలం టేనే ముక్కులు మూసుకుని ఊపిరి బిగపట్టి పోవాల్సి వస్తోంది. కుళ్లిపోయిన చెత్త మూలంగా నగరంలో వ్యాధులు ప్రబలే అవకాశాలూ లేకపోలేదు. ఈ చెత్త ద్వారా బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ముదురుదోమలు పెరుగుతాయి. ఇప్పటికే నగరంలో వైరల్‌ జ్వరాలు పెరిగాయి. అసలే ఇది రోగాల సీజన్‌. ఈ చెత్త మూలంగా మరిన్ని రోగాలు ముసిరే అవకాశముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here