Home జిల్లా వార్తలు వివాదం సమసినట్లేనా?

వివాదం సమసినట్లేనా?

దాదాపు రెండు వారాల పాటూ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి – జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజుల ఎపిసోడ్‌ నడవడం చూసాం. వ్యవసాయమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆయన అడుగులకు మడుగులొత్తుతున్నాడంటూ కాకాణి గోవర్ధన్‌రెడ్డి కలెక్టర్‌ ముత్యాలరాజుపై తీవ్రస్థాయిలో విమర్శల దాడి చేసాడు. కలెక్టర్‌పై కాకాణి విమర్శలు మరీ శ్రుతి మించడంతో ఉద్యోగ సంఘాలతో పాటు బీసీ సంఘాలు కూడా కాకాణికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగడం జరిగింది. కాకాణి విమర్శలపై కలెక్టర్‌ అయితే ఎక్కడా నోరు విప్పలేదుగాని, రెవెన్యూ సంఘాలు, బీసీ సంఘాలు కూడా కాకాణికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగడం జరిగింది.

చన్నీళ్ళకు వేనీళ్ళు సాయం అన్నట్లు తెలుగుదేశం వాళ్ళు కూడా కలెక్టర్‌కు మద్దతుగా వెంకటాచలంలో భారీ ర్యాలీ చేసారు. అయితే కలెక్టర్‌ – కాకాణి వివాదం సర్వేపల్లి నియోజకవర్గం ఒక్కదానికే పరిమితమైతే ఫర్వాలేదు. ఆయన దూకుడు పెంచే కొద్ది దాని ప్రభావం వైసిపిపై పడుతుంది.

ప్రతిపక్షంలో వుంటేనే వీళ్ళు ఉన్నతాధికారులను ఇలా దుమ్మెత్తి పోస్తున్నారు, ఇక అధికారంలోకి వస్తే ఎలా చేస్తారో అనే అనుమా నాలకు బీజం వేస్తుంది. దీనికితోడు కలెక్టర్‌ బి.సి కావడంతో ఆ వర్గం ప్రజలపై ఎంతోకొంత ప్రభావం పడుతుంది. రాజకీయా లకు సంబంధం లేని అధికారుల పట్ల దూకుడుగా వ్యవహరించ వద్దని, రాజకీయ ప్రలోభాలకు, అధికారపార్టీ ఒత్తిళ్ళకు లొంగే అధికారులను ఏమన్నాకూడా ప్రయోజనం లేదని పార్టీ అధిష్టానం చేసిన సూచనలతో కాకాణి వెనక్కి తగ్గాడని తెలుస్తోంది. అధిష్టానం సూచనతోనే ఆయన తన పోరాటం మంత్రి సోమిరెడ్డి మీదేనని కలెక్టర్‌ మీద కాదని సెలవిచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here