Home జిల్లా వార్తలు విపిఆర్‌కు సైతం… కోపమొచ్చింది

విపిఆర్‌కు సైతం… కోపమొచ్చింది

”అజాతశత్రువే ఆగ్ర హించిన నాడు”.. అని మహా భారతంలో వుంది. ఎప్పుడూ శాంతి, సహనంతో వుండే వాళ్ళకు ఒక్కసారిగా ఆవేశం వస్తే ఎవరూ తట్టుకోలేరు. పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలో బయటవాళ్లెవరూ ఆగ్రహాన్ని చూసి వుండరు. ఆయనెప్పుడూ ప్రశాంతంగా, ఆగ్రహావేశాలను జయించిన మనిషిలాగానే కని పిస్తుంటారు. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలోనూ జగన్‌పై హత్యాయత్నం సంఘటన కోపాన్ని తెప్పిం చింది. సంఘటన కంటే కూడా దానిపై ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు స్పందించిన తీరు చూసి వేమిరెడ్డిలో ఆవేశం నషాళానికి అంటింది.

ఆయన బుద్ధి పగవాడికి కూడా వద్దు..

గత నెల 26వ తేదీన హైదరాబాద్‌ ఆసుపత్రిలో జగన్‌ను పరామర్శించిన అనంతరం బయటకొచ్చిన ఆయన మీడియా ముందు చంద్రబాబు నీతిబాహ్య వ్యాఖ్యలను చీల్చిచెండాడాడు. చంద్రబాబులో కనీస మానవత్వం లోపించిందని, ఆయన బుద్ధి పగవాడికి కూడా రాకూడదని వేడుకుంటున్నానని అన్నారు. కత్తి దాడిలో గాయపడిన జగన్‌ను మాటవరుసకైనా పరామర్శించని చంద్రబాబును ఆయన నరరూప రాక్షసుడితో అభివర్ణించారు. సానుభూతి కోసం జగన్‌ డ్రామాలాడుతున్నాడని చంద్రబాబు అనడం, మని షిగా ఆయన ఎంత దిగజారిపోయాడో చెప్పడానికి సంకేతం. జగన్‌కు కొత్తగా సాను భూతి అవసరం లేదు. రాష్ట్ర ప్రజలే ఆయన వెన్నంటి వున్నారు. అలాంటి డ్రామాలేవన్నా వుంటే మీకే అవసరం. అలిపిరిలో చంద్రబాబుపై మందుపాతర దాడి జరిగినప్పుడు వై.యస్‌. రాజశేఖరరెడ్డి తిరుపతికొచ్చి నిరసన దీక్ష చేశారు. ఈరోజు ఆయన కుమారుడు జగన్మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే చంద్రబాబు ఒక మనిషిగా స్పందించకపోగా వెకిలి చేష్టలు, వ్యంగపు మాటలతో చరిత్రహీనుడిగా మిగిలిపోయాడని, నీ మనస్తత్వం ఇప్పటికే అంటురోగంలా మీ పార్టీ నాయకులకు కూడా సోకి వాళ్ళు కూడా అలాగే తయారయ్యారని, మీ మనస్తత్వం, మీ నీచ బుద్ధి ఈ భూలోకంలో ఇంకెవరికీ రాకూడదని భగవంతుడిని వేడుకుంటున్నానని వేమిరెడ్డి ఆవేశంగా చెప్పారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రపు చీడపురుగుగా ఆయన చంద్రబాబును అభివర్ణించారు. అబద్దాలు, ఉత్తుత్తి హామీలతో ముఖ్యమంత్రివైన నీకు, రైతు ఋణమాఫీ అని ఒక్క హామీ ఇచ్చివున్నా అధికారం వస్తుందని తెలిసి కూడా ఆ హామీని అమలు చేయడం అసాధ్యం అని తెలిసి నిజాయితీకి కట్టుబడ్డ జగన్‌కు నక్కకు నాగలోకానికి వున్నంత తేడా వుందని విపిఆర్‌ ఎద్దేవా చేశారు.

మొత్తానికి అజాతశత్రువు ఆగ్రహిస్తే ఎలా వుంటుందో విపిఆర్‌ వ్యాఖ్యలు వింటేనే అర్ధమౌతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here