Home జిల్లా వార్తలు వినయ విధేయ ‘చంద్రం’

వినయ విధేయ ‘చంద్రం’

ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టడం అంటే ఇదేనేమో! రాజకీయాలలో ఇలాంటి టెక్నిక్‌లను అందరూ ఉపయోగించలేరు. అపర రాజకీయ చాణుక్యుడిగా పేరున్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

అలాంటి పాలిట్రిక్స్‌నే ప్లే చేశాడు. తన శాసనమండలి సభ్యత్వానికి ఎన్నికలకు ముందే రాజీనామా చేశాడు. తన రాజీనామా లేఖను మండలి ఛైర్మెన్‌కు అందజేశారు.

రేపటి సార్వత్రిక ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా నిర్ణయించింది. ఆయనకు ఎమ్మెల్సీ పదవికి ఇంకా రెండేళ్ళ గడువుంది. రేపు ఎన్నికల్లో గెలిస్తే ఎమ్మెల్సీకి రాజీనామా చేయొచ్చు. ఓడిపోతే ఎమ్మెల్సీగా రెండేళ్ళు కొనసాగొచ్చు. కాని, ఇక్కడ సోమిరెడ్డి తన పార్టీ గురించి ఆలోచించాడు. త్వరలో ఎమ్మెల్యే ఎన్నికలకు నోటిఫికేషన్‌ రాబోతోంది. ఎలాగూ మంత్రిగా కొనసాగవచ్చు. రేపు తెలుగుదేశం తిరిగి గెలిస్తే తానూ సర్వేపల్లి నుండి గెలిస్తే మంత్రిగా కొనసాగవచ్చు. పార్టీ ఓడిపోయి, తానూ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి వున్నా ఒకటే లేకున్నా ఒకటే!

దానికంటే కూడా ఎన్నికలకు ముందే ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తే ఈ పదవిని టిక్కెట్‌ రాక అసంతృప్తితో వున్న ఇంకొకరికి అడ్జస్ట్‌ చేయొచ్చు. తద్వారా పార్టీకి మేలు చేసినవాళ్లం అవుతామని చెప్పే పార్టీ కోసం సోమిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా, రేపు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న మిగతా ఎమ్మెల్సీలను కూడా చంద్రబాబు అదే బాట పట్టమని సూచించడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here