Home జిల్లా వార్తలు విదేశీపక్షుల కిలకిలారావాలతో.. కళకళలాడుతున్న నేలపట్టు

విదేశీపక్షుల కిలకిలారావాలతో.. కళకళలాడుతున్న నేలపట్టు

ఇటీవల కురిసిన వర్షాలతో దొరవారిసత్రం మండలంలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం పక్షుల కిలకిలారావాలతో పుల కించిపోతోంది. గత నాలుగైదు రోజులుగా ఈ ప్రాంతంలో విదేశీ విహంగాల సందడి మొదలైంది. పక్షుల కేంద్రంలోని రెండు చెరువుల్లోకి నీళ్ళు చేరడంతో పక్షుల ఆహారవిహారాలకు లోటులేకుండా ఉంది. దూరదేశాల నుంచి ఇక్కడికి వచ్చే రకరకాల రంగురంగుల పక్షులతో నేలపట్టు పర్యాటకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ప్రసిద్ధమైన పెలికాన్‌ పక్షులు(గూడబాతులు) వందల సంఖ్యలో ఇక్కడికి చేరాయి. ఇంకా తెల్లకంక ణాయిలు, నత్తగుల్ల కొంగలు, నీటికాకులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి చెరువుల గట్లపై ఉన్న కడపచెట్లపై వాలి గూళ్ళు కట్టుకుంటున్నాయి. సుమారు 5వందలకు పైగానే పెలికాన్‌లు, 2వందలకు పైగా తెల్లకంకణాయిలు, 3వందలకుపైగా నత్తగుల్ల కొంగలు, వందలాది నీటికాకులు, బాతుజాతికి చెందిన రకరకాల పక్షులు నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలోకి వచ్చాయని వన్యప్రాణి సంరక్షణ అధికారులు పేర్కొంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here