Home రాష్ట్రీయ వార్తలు విడగొడదాం… పడగొడదాం..!

విడగొడదాం… పడగొడదాం..!

తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబే ఏరికోరి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాడు. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా భవిష్యత్‌లో చంద్రబాబు అవసరం వుండొచ్చనే ముందుచూపుతో ఆయనతో కలిసి ముందుకుపోవడం, బొక్కబోర్లా పడడం జరిగింది.

చంద్రబాబుతో పొత్తు లేకున్నా అక్కడ కాంగ్రెస్‌కు కనీసం ఇంకో పది సీట్లన్నా పెరిగేవేమో! చంద్రబాబుతో పొత్తు తెలం గాణలో కాంగ్రెస్‌కు ప్రమాదం. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు తెలుగు దేశంకు అపాయం అని ఒక రాజకీయ చర్చ ఎప్పటినుండో నడుస్తోంది. తెలం గాణ ఎన్నికల్లో చంద్రబాబు వల్ల కాం గ్రెస్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఏపిలో కాంగ్రెస్‌ మూలంగా తనకు ప్రమాదం సంభవించకుండా జాగ్రత్త పడుతున్నాడు చంద్రబాబు. కాంగ్రెస్‌తో పొత్తును తెలంగాణకు ఆపే శాడు. రేపు సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు మద్దతు వుంటుందంటున్నాడు. ఏపి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌ నాయకులకు ఒక పాత్ర అప్పగించాడు. అదేంటంటే కాంగ్రెస్‌పార్టీ తరపున 175 నియోజకవర్గాలలో అభ్యర్థులు పోటీ చెయ్యాలి. ప్రతి నియోజకవర్గంలోనూ రెండువేల నుండి పదివేల దాకా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వైసిపికి పోకుండా చీల్చాలి. కాంగ్రెస్‌ అభ్యర్థులకు కావాల్సిన సరం జామా చంద్రబాబే చూసుకుంటాడు. ముఖ్యంగా కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రయో గించి వైసిపి సానుభూతిపరులుగా వున్న రెడ్డి, ముస్లిం, క్రిస్టియన్‌ ఓట్లలో భారీ చీలిక తేవడం వీరి లక్ష్యం. కాంగ్రెస్‌, బాబుల రహస్య ఒప్పందాన్ని ఇటీవల కాంగ్రెస్‌ నుండి బయటకొచ్చి వైసిపిలో చేరిన రవిచంద్రారెడ్డి వెల్లడించడం తెలిసిందే!

కాంగ్రెస్‌ చీల్చుకునే ఓట్లను కాంగ్రెస్‌ చీల్చుకోగా, పవన్‌ కళ్యాణ్‌ జనసేన కూడా ఓట్ల చీలికకు చంద్రబాబు డైరక్షన్‌లో తన పాత్రను పోషించబోతుంది. వామపక్షా లతో కలిసి జనసేన పరిమిత సీట్లలో పోటీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పరిమిత సీట్లలో అంటే చంద్రబాబు చెప్పిన సీట్లలో పవన్‌ తన అభ్యర్థులను నిలుపు తాడని అర్ధం. వైసిపి గెలిచే అవకాశాలున్న నియోజకవర్గాలలో ఆ పార్టీ అభ్యర్థులు ఏ సామాజికవర్గం వారైతే అదే సామాజిక వర్గం వారిని జనసేన అభ్యర్థులుగా దించి, వైసిపి సానుభూతిపరుల ఓట్లతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం… తద్వారా తెలుగుదేశం అభ్యర్థుల గెలుపుకు బాటలు వేయడం. చంద్రబాబు ఈసారి కాంగ్రెస్‌, జనసేనలను బాగా నమ్ముకుని వున్నాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఆ పార్టీలు ఎంతగా చీలిస్తే తెలుగుదేశంకు అంతగా లాభం అన్నది బాబు నమ్మకం. వీటితో పాటు బీజేపీ, ప్రజాశాంతి వంటి పార్టీలు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లనే చీలుస్తాయి కాబట్టి ఈసారి చంద్రబాబు అధికారం కోసం ఓటర్ల కంటే ఆయా పార్టీలు తెచ్చుకునే ఓట్లనే ఎక్కువుగా నమ్ముకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here