Home జిల్లా వార్తలు విఆర్‌ ఎన్నికలకు మోగిన గంట!

విఆర్‌ ఎన్నికలకు మోగిన గంట!

నెల్లూరు నగరంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే విఆర్‌ విద్యా సంస్థల పాలకవర్గం ఎన్నికలు ప్రతి ష్టాత్మకంగా మారబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఓట్ల నమోదు ప్రక్రియ, ఓట్ల జాబితా విడు దల తంతు ముగిసిపోగా, తాజాగా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ విద్యాసంస్థల పాలకవర్గం ఎంపికకు సంబంధించి జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆసక్తి వున్న విఆర్‌ పూర్వవిద్యార్థులు ఈ నెల 7వ తేదీన ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నం 2గంటలలోగా కలెక్టరేట్‌లోని విఆర్‌ విద్యాసంస్థల ప్రత్యేక అధికారి మరియు జాయింట్‌ కలెక్టర్‌ అయిన వెట్రి సెల్వి కార్యాలయంలో తమ నామినేషన్‌లను సమర్పించాలి. 8వ తేదీ ఉదయం 11గంటలకు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. విఆర్‌ విద్యాసంస్థల ఓటర్ల లిస్టును దరఖాస్తు చేసుకున్న పూర్వవిద్యార్థుల పరిశీలన కోసం జనవరి 31వ తేదీ నుండి జాయింట్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అందుబాటులో వుంచారు.

విఆర్‌ పూర్వవిద్యార్థులకు సంబంధించి మొత్తం 19వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. వివరాలు, సరైన పత్రాలు లేని కారణంగా 4వేలకు పైగా దరఖాస్తులను తిరస్కరించగా, 15,157 మంది ఓటర్లు తేలారు. మరో 1275మంది పాత ఓటర్లు వున్నారు. కాగా, విఆర్‌ విద్యాసంస్థల కమిటి ఎన్నికలకు సంబంధించి నాలుగు ప్యానెళ్ళు పోటీ పడుతున్నాయి. గత పాలక కమిటీపై సుప్రీం కోర్టు దాకా వెళ్ళి దాదాపు 3దశాబ్దాలు న్యాయపోరాటం సాగించిన ఆడిటర్‌, బీజేపీ నాయకులు ఆమంచర్ల శంకర నారాయణ ఇటీవల హఠాత్తుగా మరణించడం తెలిసిందే! ఆయన మరణంతో ఆయన తరఫు ప్యానెల్‌ కొంత బలహీనపడినట్లే!

ఇక పోటీలో ప్రముఖ న్యాయవాది మలిరెడ్డి శ్రీనివాసులు తరపు ప్యానెల్‌ బలంగా వున్నట్లు కనిపిస్తోంది. అలాగే గత కమిటి ద్వారా పెత్తనం చేసిన ఆనం వర్గం కూడా ఎన్నికల బరిలో నిలవబో తుంది. విఆర్‌ పూర్వాధ్యక్షుడు తులసీరామిరెడ్డి ప్యానెల్‌ కూడా ఎన్నికలకు సిద్ధంగా వుంది.

ఇంకా ఎన్నికల తేదీ ప్రకటించలేదు. ఈలోపు పూర్వవిద్యార్థుల నాయకులు కూడబలుక్కుని ఏక గ్రీవంగా కమిటీని ఎన్నుకుంటే అసలు ఎలక్షనే వుండదు. రాజీ కుదరకపోతే మాత్రం విఆర్‌ పాలక వర్గం కమిటి ఎన్నికలలో 15వేల మందికి తొలిసారి ఓటేసే అదృష్టం కలుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here