Home జిల్లా వార్తలు విఆర్‌సి పాలకవర్గ ఎన్నికల ప్రక్రియకు పచ్చజెండా!

విఆర్‌సి పాలకవర్గ ఎన్నికల ప్రక్రియకు పచ్చజెండా!

విఆర్‌ విద్యాసంస్థల పాలకవర్గం ఎన్నిక కోసం ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలైంది. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మరియు విఆర్‌ విద్యా సంస్థల ప్రత్యేక అధికారిగా వున్న కుమారి వెట్రిసెల్వి దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేశారు. విఆర్‌ విద్యాసంస్థల్లో భాగమైన విఆర్‌ హైస్కూల్‌, విఆర్‌ ఇంటర్‌, డిగ్రీ కాలేజీ, విఆర్‌ న్యాయ కళాశాల, విఆర్‌ ఐఏఎస్‌, విఆర్‌ ఐపిఎస్‌, విఆర్‌ బిఇడి, విఆర్‌ డిఎడ్‌ కళాశాలల్లో 2016లోపు ఎప్పుడైనా ఒక అకడమిక్‌ సంవత్సరం మించి చదువుకున్నోళ్ళు ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశారు. ఈ నెల 14వ తేదీన మొదలైన ఓటర్ల నమోదు కార్యక్రమం డిసెంబర్‌ 13వ తేదీ వరకు ఉంటుంది. ఈ కేంద్రంలో ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 5రూపాయల రుసుముతో ఓటు నమోదు చేసుకోవచ్చు. విఆర్‌ విద్యాసంస్థలలో చదివిన పూర్వవిద్యార్థులందరికీ ఇదో చక్కని అవకాశం. కాబట్టి విఆర్‌ పూర్వవిద్యార్థులు ఓటర్లుగా నమోదు కావడంపై దృష్టి సారించాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here