Home నెల్లూరులో నేడు విఆర్‌సి ఎన్నికలకు సన్నద్ధం!

విఆర్‌సి ఎన్నికలకు సన్నద్ధం!

నెల్లూరులోని విఆర్‌ విద్యాసంస్థల కొత్త పాలక వర్గానికి ఎన్నికలు జరి పేందుకు ప్రభుత్వం సిద్ధ మవుతోంది. పాతికేళ్ళ క్రితం ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారా యణరెడ్డిల నేతృత్వంలో ఏర్పడ్డ కమిటీని సుప్రీం కోర్టు ఇటీవల రద్దు చేయడం తెలిసిందే! బైలాస్‌కు విరుద్ధంగా అప్పట్లో ఏకపక్షంగా ఎన్నికలు జరుపుకుని పాలకవర్గం ఏర్పడిందంటూ బీజేపీ నాయకులు ఆమంచర్ల శంకరనారాయణ మరికొందరు న్యాయస్థానాలలో సుదీర్ఘకాలం చేసిన పోరాటం ఫలితంగా ఈ కమిటీ రద్దయ్యింది. విఆర్‌ విద్యాసంస్థల పర్యవేక్షణకు జాయింట్‌ కలెక్టర్‌ వెట్రిసెల్వీని ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగింది. అయితే ఈ ఏడాది జూలైలోపు ఎన్నికలు జరిపి కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించినా ఇంతవరకు ఆ పని జరగలేదు. తాజాగా గతంలో ఆమంచర్ల శంకరనారాయణ ఎన్నికల నిర్వహణలో జాప్యంపై చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు అక్టోబర్‌ 31వతేదీ లోపు ఎన్నికలు నిర్వహించి కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో అధికార యంత్రాంగం ఎన్నికల ప్రక్రియకు కసరత్తు మొదలుపెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here