Home జిల్లా వార్తలు వాగ్దానాలు… వివాదాలు… నినాదాలు!

వాగ్దానాలు… వివాదాలు… నినాదాలు!

ఎన్నికలొచ్చాక సమస్యలు పుట్టుకొస్తుంటాయి. కొత్త వివాదాలు, కొత్త కొత్త నినాదాలన్నీ తెరమీద కొస్తుంటాయి. బూజుపట్టిన సమస్యలన్నీ మళ్ళీ జుట్టు విదిల్చుకొని రోడ్డెక్కుతుంటాయి. ఈ సమస్యలెప్పటికీ పరిష్కారం కావు. ఇవి సమస్యలుగా సజీవంగానే వుంటేనే నాయకులకు ప్రతి ఎన్నికలలోనూ అస్త్రాలుగా ఉపయోగపడుతుంటాయి.

ఈ ఎన్నికలలో నియోజకవర్గాల వారీగా అలాంటి అస్త్రాలను ఇరు ప్రధాన పార్టీల నాయకులు వాడుతున్నారు. గత రెండు ఎన్నికలుగా జిల్లాలో దుగరాజ పట్నం, రామాయపట్నం పోర్టులు ప్రధాన ఎన్నికల అస్త్రాలుగా వున్నాయి. గూడూరు అసెంబ్లీ నుండి, తిరుపతి పార్లమెంట్‌ నుండి పోటీ చేస్తున్న నాయకులేమో మా పార్టీ అధికారంలోకి వస్తే దుగరాజపట్నం పోర్టు సాధిస్తామని శపథాలు చేస్తున్నారు. కావలి నుండి పోటీ చేసే నాయకులేమో రామాయపట్నం పోర్టు అంశాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే కావలి అభ్యర్థు లకు దగదర్తి ఎయిర్‌పోర్టు కూడా ఒక ఎన్నికల నినాదంగా వుంది. ఉదయగిరి అభ్యర్థులకు ఎప్పటిలాగే వెలుగొండ ప్రాజెక్ట్‌ సాధన, సీతారాంసాగర్‌ రిజర్వాయర్‌లు ప్రధాన ఎన్నికల అస్త్రాలు. అలాగే ఈ ప్రాంతానికి సోమశిల నీళ్ళు అన్నవి కొత్తగా చేరిన స్లోగన్‌. ఇక సంగం, నెల్లూరు బ్యారేజీలను పోలవరం ప్రాజెక్ట్‌లు కట్టి నట్లుగా కడుతున్నారు. 2006లో దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఈ బ్యారేజీలకు శంకుస్థాపన చేశారు. 13ఏళ్ళుగా ఈ బ్యారేజీలను కడుతూనే వున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం ఏడాదిలోనే ఈ బ్యారేజీలు పూర్తి చేస్తామని చెప్పింది. మంత్రి నారాయణ ఈ బ్యారేజీలపై ప్రత్యేక టాస్క్‌ చేశారు. ఇదిగో ఇంకో మూడు నెలల్లో ప్రారం భిస్తాం అంటూ పదమూడుసార్లు చెప్పారు. అవి పూర్తికాకుండానే మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ప్రతి ఎన్నికల్లోనూ నాయకులకు గుర్తొచ్చే ఇంకో అంశం బిట్రగుంట రైల్వే అభివృద్ధి. ఈ ఎన్నికల్లో కూడా అది మళ్ళీ గుర్తుకొచ్చింది. ఈసారి కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీ తిరిగి తెరిపిస్తామని ఎవరూ అనడం లేదు. ఎందుకంటే తిరిగి తెరి పించలేనంతగా అది పాడైపోయిందనే విషయం అందరికీ తెలుసు. అలాగే జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌, పులికాట్‌ సరస్సు అభివృద్ధి, ధర్మల్‌ ప్రాజెక్ట్‌ల కాలుష్యం, సోమశిల హైలెవల్‌ కెనాల్‌, తెలుగుగంగ బ్రాంచ్‌ కెనాల్స్‌ వంటి అస్త్రాలు ప్రతి ఎన్నికలలోనూ ప్రచార సాధనాలుగా ఉపయోగపడుతుంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here