Home రాష్ట్రీయ వార్తలు వలసలకు వేళయ్యింది!

వలసలకు వేళయ్యింది!

ఇక సార్వత్రిక ఎన్నికలు ముగిసే దాకా ప్రతిరోజూ టీవీలు, పత్రికలలో మనకు కనిపించే సర్వసాధారణ వార్తలు… పలానా నాయకుడు వైసిపి నుండి టిడిపిలోకి జంప్‌… లేదంటే టిడిపిలో నుండి వైసిపిలో చేరిక.

రాష్ట్రంలో వలసల సీజన్‌ మొదలైంది. ఎవరికి కావాల్సిన పార్టీల్లోకి వాళ్ళు వెళుతున్నారు. గత మూడేళ్లుగా రాష్ట్ర రాజకీ యాలలో అటు ఇటు జంపింగ్‌లున్నా అవి చాలా తక్కువ స్థాయిలోనే వుండిపో యాయి. ఇక జంపింగ్‌లు ఉధృతం కాబో తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్య నారాయణ పోయి జనసేనలో చేరాడు, విజయవాడ వెస్ట్‌ టిక్కెట్‌ తనకు హామీ ఇవ్వలేదనే కారణంతో వంగవీటి రాధా వైసిపికి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరడానికి సిద్ధమయ్యాడు. రాధా తండ్రి వంగవీటి రంగ 1988లో విజయవాడ నడిబొడ్డులో దారుణ హత్యకు గురయ్యాడు. ఆరోజు అధికారంలో వుండింది తెలుగు దేశం ప్రభుత్వమే! ఆ హత్యకు కారకు లెవరో అందరికీ తెలుసు. ఏ నేపథ్యంలో ఆయనను హత్య చేసారో కూడా తెలుసు. అప్పటి నుండి ఇప్పటి దాకా కూడా రంగా అనుచరులు, అభిమానులు తెలుగుదేశంకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఇంతకాలం కొనసాగాయి. ఇప్పుడు అదే తెలుగుదేశంలో వంగవీటి రాధా చేరుతున్నాడంటే రంగా అభిమానుల పరిస్థితి ఎలా వుండబోతుందో వారికే తెలియాలి.

ఇక ఈ నాలుగున్నరేళ్లలో వైసిపి నుండి గెలిచిన 28మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపిలు తెలుగుదేశంలో చేరారు. వాళ్లెవరూ విలువలకు కట్టుబడి తమ పద వులకు రాజీనామా చేయలేదు సరికదా, నలుగురు ఎమ్మెల్యేలైతే మంత్రి పదవులు కూడా తీసుకున్నారు. కాని, జగన్‌ మాత్రం తెలుగుదేశం నుండి ఎవరు తన పార్టీలోకి వస్తున్నా, వారి పదవులకు రాజీనామా చేశాకే రమ్మంటున్నాడు. గతంలో శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాకే వైసిపిలో చేరాడు. తాజాగా, రాజం పేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్‌రెడ్డి కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే వైసిపిలో చేరబోతున్నాడు. వైసిపిలో చేరే వాళ్లకు, వైసిపిని వదులుతున్న వాళ్ళకు ఇదే తేడా!

వలసలకు అంకురార్పణ జరిగినట్లే… ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాష్ట్ర రాజ కీయాల్లో భారీ మార్పులుండబోతున్నాయి. అటు, ఇటు పెద్ద పెద్ద నాయకులే జంపింగ్‌ చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here