Home జిల్లా వార్తలు వర్షం వచ్చిందని ఆనందించాలా..? రోడ్లపై పోలేక ఏడవాలా?

వర్షం వచ్చిందని ఆనందించాలా..? రోడ్లపై పోలేక ఏడవాలా?

నెల్లూరులో వర్షం కురుస్తోంది… రెండు, మూడేళ్ళ తర్వాత అమెరికా నుండి మన కూతురో, కొడుకో వస్తుంటే ఎంత ఆనందంగా వుంటుందో ఒక్కసారిగా వర్షాన్ని చూసిన నెల్లూరు జనానికి కూడా అంతకంటే ఆనందంగా వుంది. ఎందుకంటే వర్షాల కోసం జనం మొహం వాచిపోయి వున్నారు.

నిన్నటిదాకా నెల్లూరులో చినుకు లేదు? ఎండలు కూడా అట్లా ఇట్లా కాయ లేదు. వేసవి కాలాన్ని తలపించే విధంగానే ఎండలు కాసాయి. ఆఖరకు వర్షాల కోసం తుఫాన్‌లు వచ్చినా బాగుండనుకున్నారు. అయితే తుఫాన్‌లు కూడా నెల్లూరు ముఖం చూడ్డం ఇష్టం లేనట్లుగా తమిళనాడు వైపుకు పారిపోయాయి.

ఏదో ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మూలంగా కొద్దిపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు కూడా లేకపోతే నెల్లూరులో వచ్చే నెల నుండి తాగునీటికి కూడా నానా తంటాలు పడాల్సి వుంటుంది.

అయితే వర్షాలు పడుతున్నాయని ఆనందం ఒక పక్కుంటే, భూగర్భ డ్రైనేజీ పేరుతో నగరంలో తవ్వేసి పెట్టిన రోడ్లు ప్రజల పాలిట నరకకూపంగా మారాయి. భూగర్భ డ్రైనేజీ కోసం నగరంలో రోడ్ల న్నింటినీ పగలగొట్టారు. ప్రధానరోడ్లను తిరిగి బాగుచేశారు. జనావాస ప్రాంతా లలోని రోడ్లను అలాగే వదిలేసి వున్నారు. నిన్నటిదాకా రోడ్లు ధుమ్మూధూళితో జనాన్ని అగచాట్లు పెట్టాయి. ఇప్పుడు కురిసిన కొద్దిపాటి వర్షానికే తవ్వేసిన రోడ్ల మూలంగా వీధులన్నీ బురదమయమ య్యాయి. తవ్విన గుంతల్లో నీళ్ళు చేర డంతో ఏది గుంతో, ఏది రోడ్డో తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇలా గుంతల్లో పడే చాలా మంది గాయాలపాలై ఆసు పత్రులకు వెళ్ళారు. తవ్విన రోడ్లతో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న మాట వాస్తవమేనని మున్సిపల్‌ మంత్రి పి.నారా యణే స్వయంగా చెప్పారు. తవ్విన రోడ్లను వెంటనే బాగు చేసుంటే ఈ వర్షాకాలంలో ఇన్ని అవస్థలు ఉండేవి కాదు కదా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here