Home నెల్లూరులో నేడు వదలనంటున్న సూరన్న

వదలనంటున్న సూరన్న

కేరళలో వరదలు… కర్నాటకలో వరదలు… గుంటూరు నుండి శ్రీకాకుళం దాకా భారీ వర్షాలు… గోదావరి, కృష్ణానదుల పరవళ్ళు… అదేం దరిద్రమో నెల్లూరుజిల్లాను మాత్రం ఎండలు వదిలిపోనంటు న్నాయి. అప్పుడప్పుడు తుంపర్లు తప్పితే భారీ వర్షాల జాడలే లేవు. పెన్నానది ఎడారిని తలపిస్తోంది. బావులు, బోర్లు అడుగంటిపోయి బురదనీళ్లొస్తున్నాయి. నెల్లూరు నగరంలోని పెన్నా తీర ప్రాంతాలైన రంగనాయకులపేట, స్టోన్‌హౌస్‌పేట, నవాబుపేట, కిసాన్‌నగర్‌, జాకీర్‌హుస్సేన్‌నగర్‌, నవలాకులతోట వంటి ప్రాంతాల్లో కూడా బోర్లు ఎండిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నగరంలో ఎక్కడ నీటి ఎద్దడి ఏర్పడ్డా ఈ ప్రాంతాలలో మాత్రం నీటికి కరువుండేది కాదు. కాని ఈసారి ఆ పరిస్థితి ఏర్పడింది. ఎండలు ఇంకా మిడిమేళంగా కాస్తూనే వున్నాయి. మిగతా చోట్ల ఇక వర్షాలు చాలురా అనే పరిస్థితి… నెల్లూరులో మాత్రం ఇక ఈ ఎండలను భరించలేం అనే దుస్థితి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here