Home జిల్లా వార్తలు లోక్‌సభ బరిలో… మేకపా(పో)టి లేనట్లే!

లోక్‌సభ బరిలో… మేకపా(పో)టి లేనట్లే!

నెల్లూరు పార్లమెంటు స్థానం నుండి వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా ఈసారి మేకపాటి రాజ మోహన్‌రెడ్డి పోటీకి దిగడం లేదని విశ్వసనీయ సమాచారం. పార్టీ సీనియర్‌గా ఈసారి కూడా మీరే పోటీ చేయాలని మేకపాటి రాజమోహన్‌రెడ్డిని జగన్మోహన్‌రెడ్డి కోరాడని, అయితే వయసు ప్రభావం, ఆరోగ్య కారణాలతో పోటీకి దూరంగా వుండాలని, పార్టీ సేవకు అంకితం కావాలని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈమధ్య ఆయన వైసిపి మీద అలిగినట్లు, పార్టీ మారుతున్నాడంటూ పచ్చమీడియా ప్రచారం చేసింది. దీనిని ఢిల్లీలో రాజమోహన్‌రెడ్డి ఖండించారు కూడా! అంతేకాదు, తానే వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ నుండి పోటీ చేస్తానని మీడియా ముందు చెప్పాడు. వైసిపిని వదలడం లేదని ఆత్మవిశ్వాసంతో చెప్పిన మాట ఇది.

కాని, నెల్లూరు లోక్‌సభలో మేకపాటి పోటీపై సందిగ్ధం వుంది. ముఖ్యంగా ఎంపి అభ్యర్థి ఆర్ధిక సమర్ధతపైనే అసెంబ్లీ అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి వుంటాయి. సిటింగ్‌ ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డిపై కొంత వ్యతిరేకత వుంది. 2014లోనే ఇది వ్యక్తమైంది కూడా! ఈసారి కూడా అలాంటి వ్యతిరేకత పనిచేస్తే ఒకట్రెండు అసెంబ్లీలు దాని మూలంగా ఓడిపోయినా పార్టీకి తీరని నష్టం జరుగుతుంది. అందుకే ఎంపి అభ్యర్థి ప్రచారం అసెంబ్లీల మీద వుండకూడదనే మేకపాటి బదులు నెల్లూరు లోక్‌సభ బరిలో కొత్త అభ్యర్థి రంగంలోకి దిగనున్నారు. ఆ అభ్యర్థి ఎవరనేదానిపై త్వరలోనే తెర తొలగించనున్నారని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here