Home జిల్లా వార్తలు లోక్‌సభపై బహుముఖ వ్యూహం!

లోక్‌సభపై బహుముఖ వ్యూహం!

నెల్లూరు లోక్‌సభ తెలుగుదేశం అభ్యర్థి ఎవరు? అన్నది ఇంకా స్పష్టం లేదు. పలు రకాల సమీకరణలు పోల్చి చూసి ఏది బెటర్‌ అయితే దానిని అనుసరించాలని అధిష్టానం భావిస్తోంది. తెలుగుదేశం వాళ్ళు లోక్‌సభ అభ్యర్థి బలంగా వుండాలని భావించడం లేదు. లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీల అభ్యర్థులు బలంగా వుంటే ఆటోమేటిక్‌గా లోక్‌సభలో కూడా గెలుపు సాధించవచ్చని ఆశిస్తున్నారు.

ప్రస్తుతం రెండు కాంబినేషన్లు ప్రచారంలో వున్నాయి. వీటిలో ఒకటి ఆత్మకూరు టీమ్‌. ఇక్కడ బొల్లినేని కృష్ణయ్యను ఆత్మకూరు అసెంబ్లీకి దించడం, అదే నియోజకవర్గానికి చెందిన జడ్పీ ఛైర్మెన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి లేదా డిసిసిబి ఛైర్మెన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డిని లోక్‌సభకు నిలబెట్టడం. దీని ద్వారా ఆత్మకూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీని సాధించాలని, మిగతా నియోజకవర్గాలలో లోటు పాట్లు వున్నా ఇక్కడ సాధించే మెజార్టీతో పార్లమెంట్‌లో గెలవవచ్చన్నది ఒక వ్యూహం.

అయితే వైసిపి బలంగా వున్న నియోజకవర్గాల్లో ఆత్మకూరు ఒకటి! ఇక్కడ వైసిపి ఓడిపోవడం లేదా మెజార్టీ తగ్గడం ఏదన్నా జరిగితే సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి వల్లే జరగాలి! కాబట్టి తెలుగుదేశం అంచ నాకు తగ్గ ఫలితం ఇక్కడ వస్తుందా లేదా అన్నది అనుమానం.

ఇక రెండో ప్లాన్‌… కావలి నియోజకవర్గానికి చెందిన జోడీని దించడం. వైసిపికి రాజీనామా చేసిన కాటంరెడ్డి విష్ణు వర్ధన్‌రెడ్డిని నెల్లూరు లోక్‌సభకు పోటీ చేయించి, మాజీఎమ్మెల్యే బీద మస్తాన్‌రావును కావలి అసెంబ్లీ బరిలో దించడం. కావలిలో అయితే పార్టీలో బీద, ఆదాల, విష్ణు, వంటేరు వర్గాలు కలుస్తాయి. వైసిపిలో రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి ఒక్కడే! ఆయనకు ప్రత్యేకంగా వర్గాలు లేవు. పార్టీ ఓటు మీదే ఆధారపడాలి. కాబట్టి కావలి నుండి భారీ మెజార్టీని తీసుకురావచ్చని, తద్వారా పార్లమెంటుకు ఉపయోగపడుతుందని అంచనా! మరి చివరకు ఆత్మకూరు టీమ్‌తో ప్రయోగం చేస్తారో, లేక కావలి కాంబినేషన్‌ను రంగంలోకి దింపుతారో చూడాలి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here