Home గల్పిక లోకేష్‌ను సత్కరించిన కేంద్ర ఎన్నికల సంఘం

లోకేష్‌ను సత్కరించిన కేంద్ర ఎన్నికల సంఘం

ప్రపంచంలోని పాతిక మేటి నగరా లను మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసి తీస్తే వచ్చినట్లుండే అమరావతి నగరమది. ఉండవల్లిలో హైటెక్‌రత్న, సీఎం చంద్ర బాబు నివాసం. అక్కడ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, కళా వెంకట్రావ్‌లు కూడా వున్నారు. అప్పుడే ప్యాకేజీ స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ కూడా అక్కడకు వచ్చాడు. చంద్రబాబును కలిశాడు. చంద్రబాబు వుండి… ఏంటి పవన్‌, మీ విషయంలో ఆశించినంత రెస్పాన్స్‌ రావడం లేదు…. మీరు మాట్లాడిన ప్యాకేజీకి, ప్రజల్లో మీకున్న ఇమేజ్‌కు పొంతన కుదరడం లేదు… ఏదో ఒకటి చేసి మీ ఇమేజ్‌ పెంచుకోవాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను వైసిపికి పోకుండా మీకు పడేటట్లు చేసు కోవాలి అని అన్నాడు. దానికి పవన్‌… ఏం చేసేది సార్‌, నేను చేయాల్సిందంతా చేస్తున్నా, చివరకు హైదరాబాద్‌లో ఆంధ్రుల మీద దాడులు చేస్తున్నారంటూ భావోద్వేగాలను రెచ్చగొట్టాలని చూసా, కాని ప్రజలు రెచ్చిపోవడం లేదు, చివరకు సిగ్గు విడిచి వైసిపికి ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్టేనని కూడా ప్రచారం చేస్తున్నా, అయినా జనాలకు తలకెక్కడం లేదంటూ వాపోయాడు. అప్పుడు చంద్రబాబు… ఇక లాభం లేదు డైరెక్ట్‌గా మనం రంగం లోకి దిగాల్సిందే పద అంటూ లేచాడు.

————–

హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌… లోపల కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు, కవిత, జగదీష్‌రెడ్డి తదితరులు పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం గురించి మాట్లాడు తున్నారు. అంతలో బయట నుండి పెద్దగా అరుపులు… రేయ్‌ కేసీఆర్‌ దమ్ముంటే రారా… వచ్చి మమ్మల్ని కొట్టరా… రేయ్‌ కేటీఆర్‌… నువ్వు మగాడివే అయితే నా ఒంటి మీద చేయి వేయ్‌రా… నా సత్తా చూపిస్తా… మీకు సిగ్గు శరం వుంటే మమ్మల్ని కొట్టండిరా… అని పెద్దగా అరుపులు.. అవి విని అందరూ ఆదుర్దాగా బయటకొచ్చారు. అక్కడ చూస్తే రోడ్డు మీద చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు నిలబడి వున్నారు. పసుపు ఛానెల్స్‌ కెమెరాలు వున్నాయి. కేసీఆర్‌ వుండి… ఏంది చంద్రబాబు నీ లొల్లి… ఎన్నికల ప్రచారంలో మేం గిట్లా పరేషాన్‌ అవు తున్నాం… ఈ టెన్షన్‌లో పడి నేను రాత్రి రౌండ్లు కూడా వేయలేదు. పొద్దునే ఈ సోదిపురాణమేంటని అడిగాడు. అందుకు చంద్రబాబు… మీరు నాకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామన్నారు కదా, ఇప్పుడు ఇవ్వండి… మీకు దమ్ముంటే మమ్మల్నిద్దరినీ కొట్టండి… తన్నండి… మీకు తెలంగాణ పౌరుషమే వుంటే, మీ ఒంట్లో వుండేది తెలంగాణ రక్తమే అయితే మమ్మల్ని కొట్టండి… అని సవాల్‌ విసిరాడు. కేసీఆర్‌ అందుకు… నేను తాగాల్సిన మందు నువ్వేమన్నా తాగావురాబై… మిమ్మల్నేంది మేం కొట్టడమేంది…. తలకు తిక్కగాని పట్టిందా అని అడిగాడు. దానికి చంద్ర బాబు… మీకు మమ్మల్ని అనేంత ధైర్యం లేదు… మీ బ్రతుకులకు మళ్ళీ తెలంగాణ కావాల్నా… మీరు మొగోళ్ళయితే మమ్మల్ని కొట్టండి అని మళ్ళీ సవాల్‌ విసిరాడు… ఆ మాటలతో కేసీఆర్‌కు తిక్కరేగింది. వీళ్ళను ఈడ్చి పక్కనపడేయండ్రా అని పోలీసులకు చెప్పబోయాడు… అప్పుడు కేటీఆర్‌ వచ్చి… నాన్న వాళ్ళు కావాలనే మనల్ని రెచ్చగొడుతున్నారు, ఈ టీవీ గొట్టాలను కూడా అందుకే తెచ్చుకున్నారు. వీళ్ళు మనల్ని రెచ్చగొట్టి కొట్టించుకోవాలని చూస్తున్నారు. అలా కొడితే వాళ్ళ ఛానెల్స్‌లో ప్రసారం చేసుకుని రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రేపి ఏపి ఎన్నికల్లో లబ్ది పొందాలనుకుంటు న్నారు. ఇలాంటి ప్లాన్‌లకు మనం అవ కాశమివ్వకూడదు అని చెప్పాడు. అది విని కేసీఆర్‌… వీళ్ళ బ్రతుకులు చెడ… చేసిన పనులు చెప్పుకుని ఓట్లడగాలిగాని, ఇలా కూడా చేస్తారా అంటూ లోపలకెళ్లి పోయాడు. కేటీఆర్‌ మాత్రం చంద్రబాబు, పవన్‌లకు ఎండలో ఎందుకన్నా నీడలో కూర్చోండంటూ షామియానాలు వేయించి, అక్కడే కూలర్లు పెట్టించాడు. అక్కడ కూడా తమ ప్లాన్‌ పని చేయక పోవడంతో చంద్రబాబు, పవన్‌లు దిగా లుగా ఏడ్చారు. అంతలో చంద్రబాబు సెల్‌ఫోన్‌ మోగింది. అవతల నుండి భువనేశ్వరీదేవి… అర్జంట్‌గా అమరా వతికి రండి… గుడ్‌ న్యూస్‌ అంటూపెట్టే సింది. చంద్రబాబు ఏదో మన గెలుపుకు అనుకూలమైన వార్తే అయ్యుంటుందను కుని చంకలు ఎగరేసుకుంటూ అక్కడ నుండి లేచాడు.

————-

వెలగపూడి సచివాలయంలోని సమావేశ మందిరం. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ గోపాలకృష్ణ ద్వివేది, మరి కొందరు మేధావులు వేదికపై వున్నారు. ఆ హాల్‌లో చంద్రబాబు కుటుంబసభ్యు లతో పాటు పవన్‌కళ్యాణ్‌, కె.ఏ.పాల్‌, వివిధ పార్టీల నాయకులు వున్నారు. సునీల్‌ అరోరా ఆనాటి సమావేశాన్ని మొదలుపెట్టి మాట్లాడుతూ.. ఎన్నిక లన్నాక అన్ని పార్టీల నాయకులు ప్రతి రోజూ తీవ్రమైన ఒత్తిడిలో వుంటారు. ఇలాంటి టెన్షన్‌లను అధిగమించేందుకు, ఎన్నికల వాతావరణాన్ని కూల్‌గా, కామెడీగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఒక రియాల్టీ షోను నిర్వహించాం. ఈ రియాల్టీ షోలో దేశ వ్యాప్తంగా ఎందరో నాయకులు పాల్గొన్నారు. కాని, అన్ని రాష్ట్రాల కంటే కూడా ఏపికి చెందిన ఇద్దరు నాయకులు ఈ కాంటెస్ట్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. ఒకరు నారా లోకేష్‌ కాగా, రెండోవారు కె.ఏ.పాల్‌. మొన్నటివరకు వీరిద్దరూ సమఉజ్జీలుగా వున్నప్పటికీ గత నాలుగు రోజుల్లో చోటు చేసుకున్న పరిణామాలతో కె.ఏ.పాల్‌ను అధిగమించి లోకేష్‌ దూసుకుపోయాడు. ఆయన ఈ పోటీలో ప్రథమ స్థానంలో నిలవడానికి కారణమైన క్లిప్పింగ్స్‌ మీరే చూడండి అంటూ అక్కడే ఒక స్క్రీన్‌ ఏర్పాటు చేశారు. ప్రొజెక్టర్‌ ఆన్‌ చేశారు. స్క్రీన్‌పై సీన్‌లు… మంగళగిరి ప్రచా రంలో లోకేష్‌ ప్రసంగిస్తూ…

శ్రీ ఏప్రిల్‌ 9వ తేదీన జరిగే ఎన్నికల్లో మీరంతా నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలి.

శ్రీ మంగళగిరి నుండి 5లక్షల మెజార్టీతో గెలుస్తా…

శ్రీ మన మచిలీపట్నం పోర్ట్‌ను కేసీఆర్‌ తెలంగాణకు తరలించుకుపోవాలని చూస్తున్నారు.

ఈ మూడు సీన్‌లను చూసాక ఆ సమావేశంలో వున్నోళ్ళంతా చప్పట్లతో మార్మోగించారు. మళ్ళీ సునీల్‌అరోరా మాట్లాడుతూ… టెన్షన్‌ ఎన్నికల వాతా వరణంలో కూడా లోకేష్‌ చక్కని కామె డీతో అందరి మానసిక వికాసానికి కృషి చేశారు. అందుకే 2019 ఎలక్షన్‌ కామెడీ స్టార్‌ అవార్డ్‌ను లోకేష్‌కు ఇస్తున్నామని ప్రకటించాడు. అంతేకాదు, లోకేష్‌ను వేదికపైకి ఆహ్వానించి అవార్డుతో సత్క రించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here