Home జిల్లా వార్తలు లబ్‌… డబ్బు… తెరచుకోనున్న విద్యా సంస్థలు

లబ్‌… డబ్బు… తెరచుకోనున్న విద్యా సంస్థలు

వేసవి సెలవులు అయిపోవచ్చాయి. ఈ నెల 11 నుండే జిల్లాలోని పాఠశాలలన్నీ పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 1వ తేదీ నుండే జూనియర్‌ కళాశాలలు తెరచు కున్నాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పూర్తయ్యి క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక స్కూల్స్‌ ప్రారంభమైతే తల్లిదండ్రులకు వచ్చే సమస్యలు ఎలాగూ రాకమానవు. స్కూల్‌ ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్స్‌, బూట్లు… వీటికి డబ్బులను ఎత్తిపెట్టాలి. ప్రతి ఏటా మధ్యతరగతి ప్రజలకు ఇదో సమస్య. ప్రైవేట్‌ పాఠశాలల్లో పోటాపోటీగా అడ్మిషన్లు జరుగుతున్నాయి. పాఠశాలలు తెరచుకుంటే ఒకటిన్నర నెలలుగా విశ్రాంతిలో వున్న స్కూలు బస్సులు మళ్ళీ రోడ్లపై విహరిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here