Home రాష్ట్రీయ వార్తలు లగడపాటి… ముంచేసాడు

లగడపాటి… ముంచేసాడు

క్రికెట్‌ తర్వాత బెట్టింగ్‌లు ఎక్కువుగా జరిగేది ఎన్నికల ఫలితాల మీదే! నిన్న తెలంగాణ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా వందల కోట్ల పందేలు జరిగాయి.

నెల్లూరుజిల్లాలోనూ ఈ పందేలు పతాక స్థాయికి చేరాయి. ఎన్నికలకు ముందు ఎక్కువమంది టిఆర్‌ఎస్‌ విజయంపైనే పందేలు కాశారు. ఒకటికి రెండు వంతున కూడా పందెం కట్టారు. అంటే టిఆర్‌ఎస్‌ గెలిస్తే, ఆ పార్టీ మీద పెట్టినవాళ్ళకు లక్షకు లక్ష వస్తాయి. అలాకాకుండా కాంగ్రెస్‌ గెలిస్తే ఈ పార్టీపై పందెం పెట్టిన వాళ్ళకు లక్షకు రెండు లక్షలు ఇవ్వాల్సి వుంటుంది. ఎన్నికలయ్యాక పలు సర్వే సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ను వెల్లడించాయి. స్థానిక, జాతీయ మీడియా సంస్థలన్నీ కూడా తెలంగాణ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కే మెజార్టీని ఇచ్చాయి. అయితే ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్‌ మాత్రం కాంగ్రెస్‌ కూటమికి మెజార్టీ రాబోతుందంటూ తన ఫలితాలను వివరించారు. దీంతో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల్లో నమ్మకం పెరిగింది. వాళ్ళు ఇతర సర్వేలను నమ్మలేదు. కేవలం లగడపాటి సర్వేపై నమ్మకంతో కాంగ్రెస్‌ కూటమి గెలుస్తుందంటూ కోట్ల రూపాయలు పందేలు కట్టారు. 9, 10 తేదీలలోనే వందల కోట్ల పందేలు జరిగాయి. లగడపాటి సర్వేను నమ్మే పందేలు కట్టిన వాళ్ళంతా ఇప్పుడు ఫలితాలు చూసి లబోదిబోమంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here