Home జిల్లా వార్తలు రాష్ట్రంలోనే… ఆసక్తిగా మారిన నెల్లూరు నగరం

రాష్ట్రంలోనే… ఆసక్తిగా మారిన నెల్లూరు నగరం

ఈసారి ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలు ప్రత్యేకతని సంతరించుకున్నాయి. వాటిలో మంగళగిరి మొదటిదైతే, నెల్లూరు నగరం రెండవది. వీటి ప్రత్యేకత ఏంటంటే ఈ రెండు చోట్లా వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులుగా సామాన్యకుటుంబీకులు పోటీ చేస్తుండడమే! అలాగే రెండు చోట్లా కూడా తెలుగుదేశం అభ్యర్థులుగా అపర కుబేరులు లోకేష్‌, నారాయణలు పోటీ చేస్తున్నారు.

నారాయణ, లోకేష్‌… ఇద్దరూ మంత్రులే, ఒకప్పటి గురుశిష్యులు కూడా! నెల్లూరు వైసిపి అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌ వై.యస్‌.జగన్‌ వీరాభిమాని. ఆయన పట్ల తన భక్తిని, విశ్వాసాన్ని ప్రతి సందర్భంలో చూపించుకుంటూ వచ్చాడు. కాబట్టే రాష్ట్ర వ్యాప్తంగా జగన్‌ అభిమా నులు నెల్లూరు నగరం నుండి అనిల్‌ గెలవాలని ఆసక్తిగా చూస్తున్నారు.

ఎప్పుడూ ‘రెడ్ల’ ఆధిపత్యం కనిపించే నెల్లూరు నగరం నియోజకవర్గం నుండి వైసిపి అభ్యర్థిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన అనిల్‌ బరిలో దిగితే తెలుగుదేశం అభ్యర్థిగా కాపు సామాజిక వర్గానికి చెందిన నారాయణ విద్యాసంస్థల అధినేత, మంత్రి పి.నారాయణ ఉన్నాడు. ప్రజాజీవనంలో వీరిద్దరివీ భిన్నమైన దారులు. అనిల్‌ది స్వర్గీయ ఆనం వివేకా నందరెడ్డి స్కూల్‌. రాజకీయ ఓనమాలు దిద్దింది అక్కడే. ప్రజలతో ఎలా మెల గాలి, ప్రజలతో ఎలా కలవాలి, ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలి అన్నది నేర్చుకున్నది అక్కడే! 2008లో సాధారణ కార్పొరేటర్‌గా రాజకీయాలలోకి అడుగు పెట్టిన అనిల్‌ ఏడాదిలోపే వై.యస్‌. ఆశీస్సులతో 2009 ఎన్నికల్లో నెల్లూరు నగరం నుండి కాంగ్రెస్‌ అభ్యర్థి అయ్యాడు. తనకున్న చాలా తక్కువ రాజకీయ అను భవంతోనే ఆ ఎన్నికల్లో పోరాడాడు. సొంత పార్టీ నేతల వెన్నుపోటు కారణంగా ఆ ఎన్నికల్లో కేవలం 90ఓట్ల తేడాతో ప్రజారాజ్యం అభ్యర్థి ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఓడిపోయాను కదా… నాకు ఈ రాజ కీయాలు ఎందుకులే అని అనిల్‌ అనుకుని వుంటే అతని రాజకీయ చరిత్ర అక్కడితో ఆగిపోయేదేమో! కాని, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అనిల్‌ రాజకీయ జీవితాన్ని వూహించని మలుపు తిప్పాయి. ఎన్నికల తర్వాత ఆనంతో విబేధించడం, 2012లో వైయస్‌ జగన్‌ వైసిపిని స్థాపించాక ఆ పార్టీలో చేరడం, నెల్లూరు నగర బాధ్యతలు తీసుకోవడం, అనునిత్యం ప్రజల మధ్య వుండడం… 2014 ఎన్నికల్లో అనిల్‌కు ఇవే తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాయి. 2014 ఎన్నికల తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రజాసమస్యల పోరాటంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. నగరంలో పలు అంశాలపై పోరాటాలు చేశాడు. పేదలకు అండగా నిలిచాడు. ఈ ఐదేళ్లలో సామాన్యులకు బాగా చేరువయ్యాడు. ఈ ఎన్నికల్లోనూ వైసిపి అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళ్లాడు.

ఇటు చూస్తే… టిడిపి అభ్యర్థి పి.నారా యణ. ధనబలంలో కొండలాంటోడు. రాజకీయ అనుభవం తక్కువ. ఐదేళ్ళుగా చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా వున్నాడు. గత రెండేళ్లలో నెల్లూరుకు నిధులు బాగానే తెచ్చాడు. పార్క్‌లు, సిమెంట్‌రోడ్లు వంటివి వేయించాడు. అయితే తవ్వినరోడ్లు ఆయనకు మంచి చేస్తాయో, ముంచేస్తాయో చూడాలి. నారా యణకు ప్రజలతో నేరుగా సంబంధాలు లేవు. క్రింది స్థాయి నాయకుల మీద ఆధారపడాలి. ఆయనకు ఇవి తొలి ఎన్ని కలు. వాస్తవంగా అయితే పదవుల కోసం ఆయన ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే అనిల్‌ మీద ఇంకెవరు పోటీ చేసినా గెలవలేరని, నారా యణ అయితేనే గట్టిపోటీ వుంటుందని పార్టీ నాయకత్వం భావించిన నేపథ్యంలో ఆయనను బరిలోకి దింపారు. నెల్లూరు నగరంలో 1994 తర్వాత తెలుగుదేశం పార్టీకి గెలుపన్నది లేదు. మరి ఈసారన్నా గెలుస్తుందో… లేక నారాయణకు కూడా సొంత పార్టీ నేతల వెన్నుపోటు తగిలి ఆ సాంప్రదాయం కొనసాగుతుందో వేచి చూడాలి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here