Home రాశి ఫలాలు రాశిఫలాలు

రాశిఫలాలు

 మేషం

తగిన నిర్ణయాలు తీసికొని పనులు జరుపుకొం టారు. ఆర్ధికముగా బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి బాగుంటుంది. ఆదాయ లోపం రాదు. కొత్త కాంట్రాక్టులు, ప్రభుత్వ ఋణాలు అనుమతులు లభిస్తాయి. స్థిరాస్తులపై ఆదాయం, పెట్టుబడులకు కొత్త అవకాశా లుంటాయి. బంధువర్గ సహకారం, ఇంటికి నూతన వస్తువులు సమకూర్చుకొంటారు.

 

వృషభం

ఇంటా బయట వ్యవహారాలను స్వయంగా పర్య వేక్షించుకొనండి. బంధుమిత్రులు సహాయపడతారు. రాజకీయ ప్రాబల్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో మంచి అభివృద్ధి ఉండి ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, కాంట్రాక్టులు, ఏజన్సీలు లభించడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో అను కూలత, దూర ప్రయాణాలుంటాయి.

 

మిధునం

చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పెట్టుబడులు స్థిరాస్తుల మీద ఆదాయం ఉంటుంది. మానసికంగా కుదుటపడతారు. ఇప్పటివరకు ఇబ్బంది పెట్టిన సమస్య సమసిపోతుంది. వృత్తి వ్యాపారాలలో పెరుగుదల, ఆదాయం బాగుంటుంది. శుభకార్యాలు, ఉద్యోగప్రయత్నాలు నిర్ణయం కావచ్చును. ఉద్యోగ సామర్ధ్యం బాగుంటుంది.

 

కర్కాటకం

వ్యాపారాలు ఆశించిన విధంగా సాగవు. ఆదాయం తగ్గుతుంది. అనుకున్న పనులు సానుకూలమైనా బాగా టెన్షన్‌ పెడతాయి. తొందరపాటు, కోపం తగ్గించుకొనాలి. అనవసర వ్యవహారాలలో తల దూర్చకండి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. ప్రభుత్వ అనుమతులు ఆలస్యం కావచ్చును. అనుకోని అదనపు ఖర్చులుపైన పడగలవు. ఆరోగ్యం బాగుంటుంది.

సింహం

అవసరాలకు ఋణాలు చేబదుళ్ళు తీసికొనవలసి వస్తుంది. వృత్తివ్యాపారాలు సరిగా జరగవు. ఆదాయం తగ్గుతుంది. ముఖ్యపత్రాలు వస్తువులు జాగ్రత్త. చిన్న వ్యాపారవర్గాల వారికి ఇంజనీరు, వైద్యులు, కాంట్రాక్టర్‌ లకు డబ్బు సమకూరుతుంది. గృహ రిపేర్లు, వస్తు వాహన రిపేర్ల ఖర్చులుంటాయి. స్థిరాస్తుల క్రయవిక్రయాలు ఆపండి. ఆరోగ్యం బాగుంటుంది.

 

కన్య

బయట ఋణ బాధలు పరిష్కరింపబడతాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కనబడుతుంది. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులకు మంచి ఆర్ధికావకాశాలు అందుతాయి. ప్రభుత్వ అనుమతులు, సహకారం బాగుం టుంది. బ్యాంకు ఋణాలు అందుతాయి. బంధుమిత్రు లను కలుసుకొంటారు. బాంధవ్యాలు బలపడతాయి. ఇతరులకు సహాయం చేస్తారు.

 

తుల

ఆర్ధికాభివృద్ధికి బాగా కష్టపడతారు. పనులు జరగ డానికి అనుకూల పరిస్థితులుంటాయి. వృత్తి వ్యాపారా లలో ఆదాయం కొంత పెరిగినా ఏదో ఒక రూపంలో ఖర్చులుంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారులతో పబ్లిక్‌తో జాగ్రత్తగా మెలగండి. చిన్న కారణం దొరికితే విమర్శించే వారుంటారు. విద్యార్థులకు ఉన్నత విద్యాకోర్సులు లభిస్తాయి.

 

8Scorpioవృశ్చికం

అయినవారితో విభేదాలు రావచ్చు. సర్దుబాటు చేసి కొనిపోవాలి. చేపట్టిన పనులు నిదానంగా జరుగుతాయి. అధికారులకు స్థానమార్పు, ఉద్యోగులకు అదనపు బాధ్యతలుంటాయి. కొత్త ఖర్చులు అదనంగా ఉంటాయి. ఏకపక్ష నిర్ణయాలు చేయవద్దు. స్థిరాస్తుల లావాదేవీలు పెండింగ్‌లో పడతాయి. శుభకార్య నిర్ణయాలు వెనుక బడగలవు. దూరప్రయాణాలుంటాయి.

 

9Sagittariusధనుస్సు

ఎక్కువ ఖర్చులుండినా ఆదాయం తృప్తికరంగా ఉంటుంది. ప్రభుత్వపరంగా జరగవలసిన పనులు ఆలస్యం కాగలవు. వృత్తి వ్యాపారాలు ఫరవాలేదని పిస్తాయి. ప్రారంభించిన పనులు ఆలస్యంగా జరుగు తాయి. కాని పర్యవేక్షణ అవసరం. శుభకార్య నిర్ణయాలు జరుగవచ్చును. తొందరపాటు మాటలు, చేతలు లేకుండా జాగ్రత్తగా మెలగండి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది.

 

10Capricornమకరం

ప్రవర్తన, మాటల తీవ్రత ఎదుటివారికి ఇబ్బంది కలిగించవచ్చును. ఆర్ధిక ఇబ్బందులుంటాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా సాగవు. ఆదాయం తగ్గు తుంది. అయితే అనుకున్న పనులు నిదానంగా జరుగు తాయి. క్రయవిక్రయాలలో జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యావృద్ధి అవకాశాలు, శుభకార్య ప్రయత్నాలలో అనుకూలత ఉంది.

 

11Aquariusకుంభం

ఆర్ధిక ఇబ్బందులు క్రమంగా తొలగి వృత్తి వ్యాపా రాలు వేగవంతం కాగలవు. క్రయవిక్రయాలు వాయిదా వేసికొనాలి. ఆదాయం కొద్దిగా పెరిగినా ఖర్చులు కూడా ఏదో ఒక రూపంలో పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలత ఉండదు. దూర ప్రయాణా లుంటాయి. షేర్లు, వ్యాపార పెట్టుబడి అవకాశాలుం టాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపండి.

 

12Piscesమీనం

నిర్ణయించుకొన్న పనులన్నీ సక్రమంగా జరుగు తాయి. ఆర్ధిక స్థితి బాగుండి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి కరంగా సాగుతాయి. ఆదాయం బాగుంటుంది. పెట్టు బడులకు మంచి అవకాశాలు దొరుకుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత బాగుంది. రావలసిన బాకీలు కొంత లభిస్తాయి. బంధుమిత్రులను కలుసుకొంటారు. కుటుంబసౌఖ్యం బాగుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here