Home రాష్ట్రీయ వార్తలు రామ్‌కు ప్రత్యేక బాధ్యతలు

రామ్‌కు ప్రత్యేక బాధ్యతలు

వైసిపి అధికారంలోకి రావాలి.. జగన్‌ ముఖ్య మంత్రి కావాలి… అనే లక్ష్యంతో ఇటీవలే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరిన నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆలోచనా దృక్పథాన్ని పార్టీ గౌరవించింది. పార్టీ ఆయనకు కీలక బాధ్యత అప్పగించింది. రామ్‌కుమార్‌ రెడ్డిని తిరుపతి, బాపట్ల పార్లమెంట్‌ స్థానాల పరిశీల కుడిగా నియమిస్తూ వైసిపి అధినేత వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. పార్టీలో చేరేటప్పుడు రామ్‌ ఎటువంటి టిక్కెట్‌గాని, పదవిని గాని ఆశించలేదు. పార్టీ ఏ పని అప్పగిస్తే ఆ పని చేస్తానన్నాడు. పార్టీలో రామ్‌ ప్రాధాన్యతను దృష్టిలో వుంచుకుని జగన్‌ ఆయనను ఈ రెండు పార్లమెంట్‌ స్థానాల పరిశీలకుడిగా నియమించారు. ఈ రెండు పార్లమెంట్‌ స్థానాలతోనూ రామ్‌కు ప్రత్యేక అనుబంధం వుంది. నేదురుమల్లి అనుచరవర్గం బలంగా వున్న వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాలు తిరుపతి పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. పార్టీలో చేరిన వెంటనే రామ్‌ ఈ నియోజకవర్గాలలో పర్యటిస్తూ పార్టీని పటిష్టం చేసే పనిలో పడ్డాడు. ఇక బాపట్ల చూస్తే 1999 మధ్యంతర ఎన్నికలలో స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ఈ పార్లమెంటు స్థానం నుండే కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసాడు. తండ్రి కోసం ఆరోజు రామ్‌కుమార్‌రెడ్డి బాపట్ల నియోజకవర్గంలో పనిచేసాడు. స్థానికులతో పరిచయా లేర్పడ్డాయి. ఈ రెండు పార్లమెంట్‌ స్థానాలకు కూడా పరిశీలకుడిగా రామ్‌కుమార్‌ సరైన నాయకుడే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here