Home గల్పిక రాఫెల్‌లో లక్షకోట్లు వృధా!

రాఫెల్‌లో లక్షకోట్లు వృధా!

అది సౌదీఅరేబియా రాజధాని రియాద్‌… ఆ సిటీలో లేబర్‌ కాలనీ… ప్రజలు పెద్దఎత్తున గుమికూడి వున్నారు. అందరి చేతుల్లోనూ భారత జాతీయ పతాకాలున్నాయి. అందరూ ఆ జెండాలు ఊపుతూ మోడీ… మోడీ అని అరు స్తున్నారు. అప్పుడే అటుగా వచ్చిన సౌదీ పోలీస్‌ ఆఫీసర్‌ సయ్యద్‌ సమద్‌… ఇక్కడకు ఇప్పుడు మోడీ వస్తున్నాడా అని అక్కడ జెండా ఊపుతున్న ఒక ప్రవాస భారతీయుడిని అడిగాడు. అందుకతను కాదు… రాహుల్‌ వస్తున్నాడని చెప్పాడు. రాహుల్‌ వస్తుంటే రాహుల్‌… రాహుల్‌ అని అరవాలిగాని ‘మోడీ’ అని అరవడ మేంటని ఆ ఆఫీసర్‌ ప్రశ్నించాడు. అందుకు ఆ భారతీయుడు… ‘మోడీ’ అనే రెండక్షరాలు వింటే మా రాహుల్‌గాంధీ పూనకంతో వూగిపోతాడు. అతనిలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. మూతి మీద మీసం లేకపోయినా రోషం పొడుచు కొస్తుంది. అతనిలోనూ ఆవేశం వుందని, అతనూ ఒక నాయకుడేనని ప్రజలు గుర్తిస్తారు. అందుకే రాహుల్‌ గాంధీ పర్యటించే చోటల్లా సోనియాగాంధీ ఈ విధంగా కార్యకర్తలను ఏర్పాటు చేసి మోడీ మోడీ అని అరిచేలా చేసింది అని చెప్పాడు. మీ నాయకుల దగ్గర ఇలాంటి తెలివితేటలు కూడా వున్నాయా అని అనుకుంటూ ఆ ఆఫీసర్‌ వెళ్లిపోయాడు. అప్పుడే రాహుల్‌గాంధీ కాన్వాయ్‌ వచ్చి ఆగింది. రాహుల్‌ దిగాడు. కార్యకర్తలు ‘మోడీ మోడీ’ అని చేస్తున్న నినాదాలు విని రాహుల్‌కు అరికాల్లో మండింది. అక్కడే వున్న వేదికనెక్కాడు. మైకందు కుని… భారతదేశంలో ఇంకా 70శాతం మంది పేదరికంలో బ్రతుకుతున్నారు. దానికి కారణం ఎవరో తెలుసా? అని సభికులను ప్రశ్నించాడు. ఎవరు? అని గుంపులో గోవిందయ్య అడిగాడు. ఇంకె వరూ… మోడీనే. భారత దేశంలో అన్ని సమస్యలకు ప్రధాన కారణం మోడీనే అని రాహుల్‌ చెప్పాడు. మరి భారతదేశాన్ని మీ పార్టీ 60ఏళ్లు పరిపాలించింది కదా… మరి పేదరికం ఎంత శాతం వుండింది అని గుంపులో గోవిందయ్య ప్రశ్నించాడు. దానికి రాహుల్‌… దేశానికి స్వాతంత్య్రం రాకముందు 90శాతం పేదరికం, 10శాతం ధనవంతులుండే వాళ్ళు. మా 60ఏళ్ళ పాలనలో ఈ 10శాతం ధనిక వర్గాలను కూడా

పేదోళ్లుగా మార్చేసాం. వంద శాతం పేదరికం దేశంగా ఇండియాకు గుర్తింపు తెచ్చాం. దేశంలో అందరూ సమానులే అనే భావన తెచ్చాం. ఈ మోడీ వచ్చాక పేదరికం 30శాతం తగ్గిపోయింది. మోడీ పాలన ఇలాగే సాగితే ధనవంతులు పెరిగి పేదలు తగ్గి వారి మధ్య అసమాన తలు ఏర్పడే ప్రమాదముందని హెచ్చ రించాడు. ఈసారి సభికుల్లో నుండి ఎన్‌ఆర్‌ఐ దుబాయ్‌ శీను లేచి… సార్‌, మీరు ఇటీవల ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ అంబానికి రాఫెల్‌ డీల్‌తో లక్ష కోట్లు దోచిపెట్టాడంటున్నారు కదా… సొంత తల్లికి, అన్నదమ్ములకు తన నాలుగున్నరేళ్ళ పాలనలో నయాపైసా ప్రయోజనం కలిగించే పని చేయని మోడీ అంబానీకి లక్ష కోట్లు ఆదాయం తెచ్చి పెట్టాడంటే ఎలా నమ్మాలి అని ప్రశ్నిం చాడు? అందుకు రాహుల్‌… నమ్మాలి, నమ్మకమే జీవితం. నమ్మకమనే ఇరుసు మీద జీవితమనే బండి చక్రం తిరుగు తుంటుంది. రాఫెల్‌ డీల్‌ ద్వారా లక్ష కోట్లు వృధా అయ్యాయి అని చెప్పి, అక్కడి సభ ముగించాడు.

————

ఐక్యరాజ్య సమితిలో అన్ని సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ సభలో రాహుల్‌గాంధీకి మాట్లాడే అవ కాశమొచ్చింది. ఆయన లేచి… మా ప్రధాని నరేంద్రమోడీ రాఫెల్‌ డీల్‌లో లక్ష కోట్లు తినేసాడు అని చెప్పాడు. అది విన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్స్‌ ఆ సంగతి మాకెం దుకని అడిగాడు. మా దేశంలో బీజేపీ ప్రభుత్వ అవినీతిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ విషయాన్ని ఇక్కడ చెబుతున్నానన్నాడు. అది విని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెర్స్‌ మనసులో… నిన్ను పప్పుముద్ద అని వూరికే అనలేదు అనుకున్నాడు.

రాహుల్‌ విదేశీ పర్యటనలో భాగంగా థాయ్‌లాండ్‌లో ల్యాండ య్యాడు. తిరిగి తిరిగి ఒళ్ళు నొప్పులుగా వుండడంతో పట్టాయలోని ఓ మసాజ్‌ సెంటర్‌కు వెళ్లాడు. మూడు వేల బాత్స్‌ (రూపాయలు)కు బేరం మాట్లాడుకుని ఒక థాయ్‌ యువతి చేత మసాజ్‌ చేయించు కుంటున్నాడు. ఆమె మసాజ్‌ చేస్తుం డగా… నీకీ విషయం తెలుసా… మా దేశ ప్రధాని మోడీ రాఫెల్‌ డీల్‌లో లక్ష కోట్ల అవినీతి చేశాడు అని చెప్పాడు. అందుకా యువతి.. నీలాంటి పప్పు సుద్దలకు మసాజ్‌ చేసుకునే కంటే మోడీతో మాట్లాడుకుని అలాంటి డీల్‌ ఏదో ఒకటి కుదుర్చుకుంటే బాగుండేదని మనసులో అనుకుంది.

్య్య్య్య్య

రాహుల్‌ విదేశీ పర్యటనలను ముగించుకుని ఢిల్లీ వచ్చాడు. ఉదయాన్నే జాగింగ్‌కు బయల్దేరాడు. పార్కులో జాగింగ్‌ చేస్తున్న పదిమందిని ఒక చోట చేర్చి.. రాఫెల్‌ కుంభకోణం గురించి వాళ్ళకు చెప్పాడు. వాకింగ్‌ అయిన తర్వాత వస్తూ వస్తూ… టీ బంకు వద్ద ఆగాడు. టీ తాగుతూ ఆ టీ బంకు అతనితో.. నీలాగే ఛాయ్‌ అమ్మిన మోడీ ఏమో ప్రధాని అయ్యాడు… నువ్వేమో ఇంకా ఛాయ్‌నే అమ్ముకుంటున్నావ్‌ అని అన్నాడు. అందుకతను… నీతోపాటే చదువుకున్న వాళ్ళ కొడుకులు, కూతుర్లకు కూడా పెళ్లిళ్లవుతున్నాయి, నువ్వేమో ఇంకా పెళ్లే చేసుకోలేదు… అని వెటకా రంగా అడిగాడు. అందుకు రాహుల్‌… పెళ్లి చేసుకుంటే ఇంటికే పరిమితం కావాల్సి వుంటుంది. మరి ప్రధాని అయితే దేశాన్ని పాలించడానికి టైమెక్క డుంటుంది? పెళ్లి చేసుకుంటే వాళ్లను షాపింగ్‌మాల్స్‌ తిప్పడానికి, చీరలకు ఫాల్స్‌ కుట్టడానికే టైం చాలదు. అందుకే పెళ్లి చేసుకోలేదు అని చెప్పి… నీకో విషయం తెలుసా… రాఫెల్‌ డీల్‌లో మోడీ లక్ష కోట్లు వృధా చేశాడు అని చెప్పాడు. టీ బంకు అతను… అవునా అన్నట్లు.. అయినా నాకు దాంతో ఏం పనిలే అని తన పనిలో తాను లీనమ య్యాడు. కాళ్ళు నొప్పెడుతుండడంతో రాహుల్‌ అటుగా వెళ్తున్న ఒక రిక్షా వాలాను పిలిచి రిక్షా ఎక్కాడు. దారిలో అతనికి కూడా రాఫెల్‌ డీల్‌ గురించి చెప్పాడు. టెన్‌జనపథ్‌ వద్ద రిక్షా దిగి అక్కడ రోడ్లు వూడుస్తున్న కార్మికుడికి కూడా రాఫెల్‌ డీల్‌ విషయం వివ రించాడు.

———–

అది పార్లమెంట్‌ భవనం… స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అధ్యక్షతన సమావేశం మొదలైంది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ లేచి… అధ్యక్షా!… రాహుల్‌ గాంధీ… పంచాయితీ కార్యదర్శి నుండి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి వరకు అందరికీ రాఫెల్‌ కుంభకోణం జరిగిం దంటూ మాపై దుష్ప్రచారం చేస్తు న్నారు… సుప్రీం కోర్టే మాకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. అలాంటప్పుడు రాఫెల్‌ విమా నాల కొనుగోలులో లక్షకోట్లు వృధా అయ్యాయని ఎలా చెప్పగలరు? ఏ ఆధా రాలతో చెప్పగలరు అని నిలదీసింది. అప్పుడు రాహుల్‌ లేచి… మనం రాఫెల్‌ యుద్ధ విమానాలను ఎందుకు కొన్నాం అని ప్రశ్నించాడు. శత్రు దేశాలైన పాకి స్థాన్‌, చైనాలను ఎదుర్కోవడానికి అని నిర్మల సీతారామన్‌ చెప్పింది. రాఫెల్‌ కంటే భయంకరమైన యుద్ధ అస్త్రాలు మన వద్ద వుండగా వేలకోట్లు పెట్టి రాఫెల్‌ విమానాలను కొనాల్సిన అవసరమే మొచ్చింది అని రాహుల్‌ ప్రశ్నించాడు. నిర్మలా సీతారామన్‌ ఆశ్చర్యంగా… రాఫెల్‌ విమానాలకంటే భయంకరమైన ఆయుధాలా… ఏంటవి అని ఆమె ప్రశ్నించింది. అప్పుడు రాహుల్‌… ఐఆర్‌20-420 హైబ్రీడ్‌ నెల్లూరు మున్సి పల్‌ కార్పొరేషన్‌ ముదురుదోమలు… వాటిని చూసి చైనా, పాకిస్థాన్‌లే కాదు, అమెరికా, రష్యా, జర్మనీ, జపాన్‌లు కూడా భయపడతాయి. అసలు ప్రపంచమే వణికి పోతుంది. అలాంటి పదునైన అస్త్రాలు మనవద్ద వేల టన్నులుండగా వేలకోట్లు పెట్టి రాఫెల్‌ విమానాలను కొన్నారు. ఇది కుంభకోణం కాదా? అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు నిర్మలా సీతారామన్‌కు తల తిరిగి అక్కడే పడిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here