Home జిల్లా వార్తలు రాజకీయ వివాదాల మధ్య చెరువులో శివలింగం

రాజకీయ వివాదాల మధ్య చెరువులో శివలింగం

నెల్లూరులోని స్వర్ణాల చెరువు… వందల ఏళ్ళ చరిత్ర వుంది. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ కంటే రెండింతలు వుంటుంది. కరెక్ట్‌గా డెవలప్‌చేస్తే ట్యాంక్‌ బండ్‌ను మించిపోతుంది. వందల ఏళ్ళ చరిత్రవున్న ఈ చెరువు క్రింద ఒకప్పుడు వేల ఎకరాల ఆయకట్టు వుండేది. ఇప్పుడు వందల ఎకరాలు కూడా లేవను కోండి. ఇప్పుడు వ్యవసాయానికంటే కూడా నెల్లూరు నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం, అలాగే టూరిజంగా కూడా ఈ చెరువు ఉపయోగపడుతోంది.

ఇక ఆథ్యాత్మికంగా కూడా ఈ చెరువుకు విశిష్ట స్థానం వుంది. నెల్లూరు గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఈ చెరువు గట్టునే వుంటుంది. అలాగే ఏటా లక్షలాదిమంది భక్తులను దేశ విదేశాల నుండి రప్పించే బారా షహీద్‌ దర్గా రొట్టెల పండుగ ఈ చెరువు చెంతనే జరుగుతుంది. కాబట్టి అటు హిందువులు గాని, ఇటు ముస్లింలు గాని ఈ చెరువును పవిత్రంగానే చూస్తారు.

చెరువు మధ్య ప్రాచీన కాలం నాటి శివలింగం వుందని, చెరువులో నీళ్ళు తగ్గితే శివలింగం బయటపడేదని, చెరువు నిండినప్పుడు శివలింగం మునిగిపోయేదనే ప్రచారం వుంది.

గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా వున్న స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి చెరువు మధ్యలో శివలింగాన్ని వెలికితీసి అక్కడొక ఆథ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేయాలని భావించారు. అయితే అప్పట్లో అది ఆచరణ రూపం దాల్చలేదు.

ఈమధ్య నుడా ఛైర్మెన్‌ కోటంరెడ్డి శీనయ్య చెరువు మధ్యలో నుండి శివలింగం, పురాతన వినాయక విగ్రహం బయటకు తీశారు. త్వరలో చెరువు మధ్యలో శివలింగం ప్రతిష్టించి అక్కడకు వంతెన ఏర్పాటు చేయస్తామని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఆయన ఉద్దేశ్యం నెల్లూరు చెరువు ప్రాంతాన్ని ఒక మంచి ఆకర్షణీయ ప్రాంతంగా రూపుదిద్దడమే! అదేదో మతాల మధ్య వివాదం సృష్టించాలని కాదు. కాని, కొందరు ముస్లిం నాయకులు దీనిని వ్యతిరేకిస్తూ బహిరంగంగా కోటంరెడ్డి శీనయ్య పైనే విమర్శలకు దిగారు. దర్గా పవి త్రతను దెబ్బతీయడానికి శీనయ్య శివలింగాన్ని ప్రతిష్టించాలని చూస్తున్నాడంటూ ఆరోపణలు సృష్టిం చారు. దీంతో ముస్లింల ఓట్లు ఎక్కడపోతాయోనన్న భయంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు శివలింగం విషయంలో ‘యూటర్న్‌’ తీసుకున్నారు. ముస్లింల అనుమతితోనే చెరువులో శివలింగం ప్రతిష్టిస్తామంటూ నుడా శీనయ్య తాజాగా ప్రకటించాడు. ఈ అంశాన్ని రేపింది శీనయ్య… ముగింపు కూడా ఆయనే ఇచ్చాడు! మరి అంత కష్టపడి చెరువులో నుండి బయటకు తెచ్చిన శివయ్యను, శీనయ్య ఎక్కడ పెడతాడో చూడాలి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here