Home జిల్లా వార్తలు రఫ్‌ ఆడిస్తున్న రస్తోగి!

రఫ్‌ ఆడిస్తున్న రస్తోగి!

పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్ల య్యింది నెల్లూరుజిల్లా పోలీసు పరిస్థితి. పనిలో పిప్పి తీసి వదిలేసిన పిహెచ్‌డి రామకృష్ణ ఈ జిల్లాను వదిలి పోయాడని సంతోషించే లోపే కొత్తగా వచ్చిన ఐశ్వర్య రస్తోగి బెండు తీయడం మొదలుపెట్టాడు.

కొత్త ఎస్పీ ప్రభావం జిల్లా పోలీసు శాఖలోనే కాదు, నెల్లూరు రోడ్ల మీద కూడా అప్పుడే కని పిస్తోంది. నేరం జరిగాక నేరపరిశోధనలు జరిపి నేరస్తులను పట్టుకోవడం కంటే కూడా ఆ నేరాలు జరగకుండా చూడడంపైనే ఆయన ప్రధానంగా దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా నగరంలో ఏ నిముషంలో ఏ ప్రాంతంలో చూసినా పోలీసులు కనపడేలా చేశాడు. ఇందుకు ఏఆర్‌ పోలీసు సిబ్బందిని కూడా వాడుకోవడం సరికొత్త ఆలోచన. ఎందుకంటే పోలీసు స్టేషన్‌లలో వున్న సిబ్బందితోనే అన్నిరకాల పనులు చేయించాలంటే కుదరదు. అదనపు సిబ్బంది కావాల్సిందే! అందుకే రస్తోగి నేరాల నియంత్రణ కోసం ఏఆర్‌ సిబ్బందిని వాడుకుంటున్నారు. పోలీసు సిబ్బందికి ఏఆర్‌ సిబ్బందిని జత చేసి ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. ఏఆర్‌ పోలీసులు మిలటరీ యూనిఫాంలో రోడ్లపై తిరుగుతున్నారు. వాహనాల తనిఖీలు ముమ్మరంగా జరుగు తున్నాయి. ఈవ్‌టీజర్లపై పోలీసులు విరుచుకుపడుతున్నారు. చైన్‌ స్నాచర్‌లు రోడ్ల మీదకు రావడం లేదు. బండ్ల తనిఖీ ముమ్మరంగా వుండడంతో రోడ్ల మీద ఆకతాయిల సాహస ప్రదర్శనలు కూడా ఆగిపోయాయి. ఇదే పోలీసింగ్‌ విధానాన్ని కొనసాగిస్తే నగరంలో పరిస్థితులు బాగుంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here