Home జిల్లా వార్తలు యువనేతకు… తెలుగు యువత

యువనేతకు… తెలుగు యువత

కీలకమైన సమయాలలో సరైన వ్యక్తులకు బాధ్యతలు అప్పగించడం అన్నది నాయకత్వ లక్షణం. జిల్లా తెలుగుదేశం పార్టీలో అలాంటి ప్రక్రియే జరిగింది. నెల్లూరుజిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా చిన్నవయసులోనే సామాజిక సేవా కార్యక్రమాలతో జిల్లా ప్రజలకు సుపరిచితుడైన మాగుంట శరత్‌చంద్రారెడ్డిని నియమిస్తూ టిడిపి జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర తీసుకున్న నిర్ణయం పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపుతోంది.

నెల్లూరు సరస్వతినగర్‌కు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్‌ మాగుంట వెంకటనారాయణరెడ్డి కుమారుడైన శరత్‌ చంద్రారెడ్డి తాము సంపాదించిన దాంట్లో కొంతైనా నాలుగు మంచి పనులకు, నలుగురికి మంచి చేసే పనులకు ఖర్చు చేయాలనే ఉద్దేశ్యంతో కొన్నేళ్ళ క్రితమే మాగుంట శరత్‌చంద్రారెడ్డి సేవాసమితిని స్థాపించారు. కొడుకు సేవాస్ఫూర్తిని అభినందించి ఆశీర్వదించిన వెంకట నారాయణరెడ్డి కూడా శరత్‌చంద్రారెడ్డి చేసే సేవా కార్యక్రమాలకు కొండంత అండగా నిలిచి సేవా మార్గంలో తన కొడుకును ముందుకు నడిపించాడు. మాగుంట శరత్‌చంద్రారెడ్డి సేవాసమితి ద్వారా నెల్లూరుజిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి. రక్తదాన శిబిరాలు జరిగాయి. ఒకేరోజు 600మందికి పైగా శరత్‌చంద్రారెడ్డి అభిమానులు రక్తదానం చేసి రికార్డు సృష్టించారు. ముఖ్యంగా పేదపిల్లలు చదివే పాఠశాలల్లో వారికి పుస్తకాలు, యూనిఫామ్స్‌, స్టేషనరీ పంపిణీ చేయడం వంటివి కోకొల్లలుగా జరిగాయి. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు

ఉచిత రవాణా కల్పించడం, మండుటెండల్లో పరీక్షలు వ్రాసి బయటకొచ్చిన విద్యార్థులకు మజ్జిగ, మంచినీళ్ళు అందించడం వంటివి చేశారు. అనాథాశ్రమాలలో, వృద్ధాశ్రమాలలో అన్నదానం, వస్త్రదానం వంటి సేవలు చేశారు. ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా గ్రామాలలో క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా సంక్రాంతి క్రీడాపోటీలు నిర్వహించారు. పలువురు క్రీడాకారులను రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు ప్రోత్సహించారు.

ఇలా వయసు చిన్నదైనా మనసు పెద్దది అని నిరూపించుకున్న శరత్‌చంద్రారెడ్డిని జనసేన వంటి పార్టీ కూడా టిక్కెట్‌ ఇస్తామని, తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించింది. అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా మాగుంట శరత్‌చంద్రారెడ్డి ఇటీవల రాజకీయంగా ఓ ముందడుగు వేసి తెలుగుదేశంలో చేరడం, నెల్లూరురూరల్‌ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి గెలుపు కోసం రేయింబవళ్ళు కష్టపడుతుండడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలుగు యువత అధ్యక్షుడిగా ఆయనను నియమిస్తే పార్టీకి ఎంతో మేలు జరుగుతుందని రవిచంద్ర ఈ పదవికి శరత్‌చంద్రను ఎన్నుకు న్నారు. శరత్‌చంద్ర 12వ తేదీ అమరావతిలో ముఖ్యమంత్రి చంద్ర బాబును కూడా కలిసి ఆయన అభినందనలు అందుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here