Home గ్రామ సమాచారం మేకపాటి… బొల్లినేని మధ్య ఆజ్యం పోస్తున్నారు!

మేకపాటి… బొల్లినేని మధ్య ఆజ్యం పోస్తున్నారు!

రాజకీయాలలో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తండ్రీకొడుకులు ప్రత్యర్థులు కావచ్చు. తలా ఒక పార్టీలో వుండొచ్చు. రాజకీయ సంబంధాలను వ్యక్తిగత సంబంధాలకు ఆపాదించుకుంటే ఈ దేశంలో మనిషికి ప్రతి మనిషి శత్రువుగానే కనిపిస్తాడు. మన దేశంలో మనుషుల మధ్య బంధాలను, అనుబంధాలను చెరి పేయడంలో ‘పైసా’ ప్రధానపాత్ర పోషిస్తుంది. దాని తర్వాత స్థానం పదవులదే! స్వార్ధ ప్రయోజనాల కోసం పదవులు రక్త సంబంధీకులను కూడా ఒకరి రక్తం ఒకరు కళ్ళచూసేంత శత్రుత్వాన్ని పెంచిపోషిస్తాయి. ఇలాంటి సంఘటననే ఇప్పుడు ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని చేజర్ల మండలం మాముడూరు వేదికగా జరిగింది.

ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యలు మంచి స్నేహితులు. ఒకప్పుడు వ్యాపార భాగ స్వాములు. వారిద్దరు కలిసే తమ పేర్ల మీదుగానే కెఎంసి అనే కన్‌స్ట్రక్షన్‌ సంస్థను స్థాపించారు. తర్వాతకాలంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పటికీ వారిమధ్య సంబంధాలు ఎప్పుడూ దెబ్బతినలేదు. ఒకప్పుడు ఇద్దరూ కాంగ్రెస్‌లోనే వున్నారు. ఆ తర్వాత బొల్లినేని కృష్ణయ్య బీజేపీలో చేరాడు. మేకపాటి సోదరులు వైసిపిలోకి వెళ్లారు. 2014 ఎన్నికల తర్వాత బొల్లినేని రాజకీయా లకు దూరంగా వుంటున్నాడు. బొల్లినేని కుటుంబసభ్యులైతే మేకపాటి రాజమోహన్‌రెడ్డి కొడుకు, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డిని తమ ఇంట్లో బిడ్డగానే చూసుకుంటారు. అంతటి అన్యోన్యతగల ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ చిచ్చు పెట్టడానికి తెలుగుదేశం నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీకి నిన్నటివరకు ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించిన ఆనం రామనారాయణరెడ్డి ఆ పార్టీని వీడనుండడం తెలిసిందే! ఆయన వెళితే ఆత్మకూరులో తెలుగుదేశం బాగా బలహీనపడుతుంది. ఇక్కడ తెలుగుదేశం కోలుకోవాలంటే పార్టీకి మాజీఎమ్మెల్యేలైన కొమ్మి లక్ష్మయ్యనాయుడు, బొల్లినేని కృష్ణయ్యలను తెరమీదకు తీసుకురావాలి. ఒప్పుకుంటే బొల్లినేని కుటుంబ సభ్యులను రంగంలోకి దించడానికి కూడా తెలుగుదేశం నాయకులు సిద్ధంగా వున్నారు. అయితే తమకున్న వ్యక్తిగత సంబంధాల దృష్ట్యా ఆత్మకూరు నుండి సిటింగ్‌ ఎమ్మెల్యేగా మేకపాటి గౌతంరెడ్డి పోటీ చేసినా లేక ఆనం రామనారాయణరెడ్డి పోటీ చేసినా బొల్లినేని వాళ్ళు పోటీ చేయరు. ఆత్మకూరు వైసిపి అభ్యర్థిగా పోటీచేసే అవకాశం వున్నది ఈ ఇద్దరికే! అందుకే ముందుగా మేకపాటి, బొల్లినేనిల మధ్య చిచ్చురేపడానికి ప్రయత్నించారు. చేజర్ల మండలం మాముడూరు బొల్లినేని సోదరుల స్వగ్రామం. ఈ గ్రామంలో ఎంపీ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసారు. ఆ గ్రామ సర్పంచ్‌ పదవీకాలం ఆగస్టు 1వ తేదీకి ముగియనుం డగా, తను పదవిలో వున్నప్పుడే ఎంపీ నిధులతో చేపట్టిన పను లను ప్రారంభించాలనుకుని ఎమ్మెల్యే గౌతంరెడ్డిని పిలిచారు. ఇది తెలుసుకుని స్థానిక తెలుగుదేశం నాయకులు కొర్రీ వేశారు. అధికార పార్టీ కాబట్టి పైస్థాయిలో ఒత్తిళ్ళు తెచ్చారు. ముఖ్యంగా బొల్లినేని కృష్ణయ్య మేనల్లుడు గిరినాయుడు, పంచాయితీ కార్యదర్శి ద్వారా ఈ ప్రారం భోత్సవాలకు కలెక్టర్‌ అనుమతి లేదని చెప్పి ఎంపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డిని పోలీసుల ద్వారా అడ్డుకున్నారు. ఆయన చేత ప్రారంభోత్స వాలు జరుగనీయలేదు.

5ఏళ్ళ క్రితం జరిగిన పంచాయితీ ఎన్నికల్లో మాముడూరు పంచాయితీకి పోటీ చేసిన బొల్లినేని కుటుంబసభ్యు రాలు ఓడిపోయింది. ఆమెపై పోటీ చేసి సర్పంచ్‌గా గెలిచిన పాపిరెడ్డి రమాదేవి ఆధ్వర్యంలో 1.50కోట్ల ఎంపీ నిధులతో పంచాయితీ భవనం, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, సి.సి.రోడ్లు వంటి పనులు జరి గాయి. ఆమె తన పదవీకాలం పూర్తయ్యే లోపు ఈ పనులను ఎమ్మెల్యే చేత ప్రారం భింపజేసుకోవాలని చేసిన ప్రయత్నం మేకపాటి, బొల్లినేనిల మధ్య చిచ్చురేపింది. తెలుగుదేశం నాయకులకు కావాల్సింది కూడా ఇదే! ఈ వివాదం ఆత్మకూరు నియో జకవర్గం కేంద్రంగా ఇంకెన్ని మలుపులు తిరగనుందో చూడాలి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here