Home గ్రామ సమాచారం మెట్ట మారుతోంది

మెట్ట మారుతోంది

నెల్లూరుజిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా ముందు వరుసలో వుండేది ఉదయగిరి నియోజకవర్గమే. అలాంటి మెట్టప్రాంతంలోనూ ఇటీవల మార్పులు కనిపిస్తున్నాయి. అభివృద్ధి ఛాయలు అగుపిస్తున్నాయి. ఏర్పేడు – మార్కాపురం మధ్య ఇటీవల నిర్మించిన జాతీయ రహదారి ఈ ఉదయగిరి ప్రాంతంలోని మర్రిపాడు, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల మీదుగా పోతుంది. దీనివల్ల ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు ఎంతో మెరుగయ్యాయి. అలాగే నడికుడి – కాళహస్తి రైల్వేలైన్‌ కూడా వింజమూరు, కలిగిరి, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల మీదుగా పోతుంది. ఈ రైల్వేలైన్‌ పూర్తయితే మెట్ట ప్రాంతానికి ఇంకొంత కళ వస్తుంది.

ఇప్పుడు సీతారాంపురం – కావలి రహదారిని జాతీయ రహదారిగా మార్పు చేశారు. అంతే కాదు, దీనిని నాలుగు లైన్లుగా విస్తరించడానికి 500 కోట్లను మంజూరు చేసారు. దీనిని ఎన్‌హెచ్‌ -167గా మార్పు చేసారు. ఈ నాలుగు లైన్ల రహదారి పూర్తయితే ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల ప్రజ లకే కాక కావలి పట్టణవాసులకు కూడా ఎంతో ప్రయోజనంగా వుంటుంది. ఈ రహదారి రెండు జాతీయ రహదారులకు అనుసంధానంగా కూడా మారుతుంది. అందుకే అంటున్నాం మెట్ట మారుతోందని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here