Home జిల్లా వార్తలు మూడు రెండయ్యేనా?

మూడు రెండయ్యేనా?

నెల్లూరుజిల్లా వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో తరచుగా వినిపించే మాట… ఒకే ఇంటిలో మూడు టిక్కెట్లు అవసరమా? పార్టీలో మేకపాటి కుటుంబసభ్యులకు సంబంధించి పలుసార్లు పలువురు సంధించిన ప్రశ్న ఇది! ఒకప్పుడు ఒకే కుటుంబంలో రెండు టిక్కెట్లు ఇస్తేనే అది కుటుంబ పెత్తనంగా వుండేది. 2014 ఎన్నికల్లో మేకపాటి కుటుంబసభ్యులు నెల్లూరు లోక్‌సభ, ఆత్మకూరు, ఉదయగిరి అసెంబ్లీల నుండి పోటీ చేసారు. నెల్లూరు లోక్‌సభ, ఆత్మకూరు అసెంబ్లీలలో గెలిచి ఉదయగిరిలో ఓడిపోయారు.

అయితే 2014కు ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా తేడా వుంది. ఇప్పుడు పార్టీలోకి కొత్త నాయకులు వచ్చారు. జిల్లాలో వుండేది ఒక లోక్‌సభ, పది అసెంబ్లీ సీట్లు. ఇందులో రెండు రిజర్వుడ్‌ సీట్లు పోతాయి. బి.సిలకు నెల్లూరు నగరం సీటును ఎత్తి పెట్టినట్లే! మిగిలిన ఏడు సీట్లలో సిటింగ్‌ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిలు వున్నారు. వీళ్లలో ఎవరినీ తీసి పక్కన పెట్టలేరు. పార్టీలో ఆనం రామనారాయణరెడ్డితో పాటు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిలు కూడా టిక్కెట్లు ఆశిస్తున్న వారిలో వున్నారు. వీరిలో ఏ ఇద్దరికీ టిక్కెట్లు ఇవ్వాలన్నా మేకపాటి ముగ్గురిలో ఒకరికి కోత వేయక తప్పదు. ఆ ఒక్కరు ఎవరన్నది వీళ్లే తేల్చుకోవాల్సి వుంటుంది. కాని ఈసారి మాత్రం మేకపాటి కుటుంబం నుండి ఇద్దరికే సీట్లు అనే టాక్‌ బలంగా వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here