Home జిల్లా వార్తలు ముస్లింలను.. ఉసిగొల్పుతున్న అజీజ్‌

ముస్లింలను.. ఉసిగొల్పుతున్న అజీజ్‌

నెల్లూరు నగరం సీటు నారాయణకే… అన్నప్పటి నుండి మేయర్‌ అజీజ్‌కు నిద్రపట్టడంలేదు. ముస్లింల కోటాలో నెల్లూరుసీటు తనకు వస్తుందని ఇంతకాలం ఆశ పెట్టుకుని వున్నాడు. ఇక్కడనుండి నారాయణే పోటీ చేస్తాడనడంతో ఇక ఆయన చంద్రబాబు వద్దకు పోయి గట్టిగా సీటు అడిగేయాలని అమరావతిలో తిష్ట వేశాడు. నగరం సీటును ఈసారి ముస్లింలకు ఇవ్వాలంటూ ముస్లిం నాయకుల ద్వారా ప్రకటనలిప్పి స్తున్నాడు. ముస్లింలతో ప్రత్యేకంగా సద స్సులు పెట్టించి ముస్లిం మైనార్టీలకు సీటు ఇవ్వాలనే నినాదం పుట్టిస్తున్నాడు. మరి నెల్లూరు టీడీపీలో మైనార్టీ వాదం ఎంత వరకు నిలుస్తుందో! జగన్‌ కాబట్టి ఆరోజు అజీజ్‌కు మేయర్‌ సీటిచ్చాడు. చంద్రబాబు అయ్యుంటే అది కూడా వచ్చేది కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here