Home జిల్లా వార్తలు ముత్యాలరాజు సాధించాడు… మువ్వాను సాగనంపాడు

ముత్యాలరాజు సాధించాడు… మువ్వాను సాగనంపాడు

మార్టిన్‌, సింధుల మధ్య బ్యాడ్మింటన్‌ పోటీ జరుగుతుంటుంది… పాయింట్ల వేటలో ఆధిపత్యం క్షణాల కాలంలో అటు ఇటు మారుతుంటుంది. ఇలాంటి టెన్షన్‌ కుర్చీ గేమే మూడునెలలుగా జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు, వివాదాల విద్యాశాఖాధి కారి మువ్వా రామలింగం మధ్య జరి గింది. జిల్లా డిఇఓగా, బిఇడి కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసి జిల్లాలో లెక్కలేనన్ని వివాదాలను నెత్తిన పెట్టుకున్న మువ్వా రామలింగంను ఈ జిల్లా నుండి తరిమే యగా, మళ్ళీ ఆయన విద్యాశాఖ మంత్రి వద్ద తనకున్న పలుకుబడితో పల్లిపాడులోని డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ పోస్టు తెచ్చు కున్నాడు. ఇతనికున్న ట్రాక్‌ రికార్డు తెలుసు కాబట్టి కలెక్టర్‌ ముత్యాలరాజు అతనిని ప్రిన్సిపాల్‌ పోస్టులో కూర్చోవద్దని చెప్పాడు. అతను లెక్కచేయకుండా ప్రిన్సిపాల్‌గా ఛార్జ్‌ తీసుకున్నాడు. కలెక్టర్‌ మళ్ళీ రామ లింగాన్ని ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చి, డైట్‌ ఇన్‌ఛార్జ్‌ ప్రిన్సిపాల్‌గా వెంకటేశ్వర్లును నియమించారు. కాని మువ్వా, కలెక్టర్‌ ఆదేశాలను పట్టించుకో కుండా కొన్ని రోజులు కాలేజీకొచ్చి ప్రిన్సి పాల్‌ సీట్లో కూర్చున్నాడు. మరోపక్క ఇన్‌ఛార్జ్‌ ప్రిన్సిపాల్‌గా వెంకటేశ్వర్లు కూడా ఉండేవాడు. కొద్దిరోజులు కాలేజీకి ఇద్దరు ప్రిన్సిపాళ్ళ వ్యవహారం నడిచింది. ఈలోపు మువ్వా రామలింగం ప్రిన్సిపాల్‌గా తననే కొనసాగించేలా విద్యాశాఖ కార్యదర్శి నుండి ఆర్డర్స్‌ తెచ్చుకున్నాడు. కలెక్టర్‌ దానిని లెక్కలోకి తీసుకోలేదు. మువ్వాను ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాలో ఉండనీయ కూడదనుకున్నాడు. ఆయన ఏ స్థాయిలో పట్టుబట్టాడో ఏమో గాని… విద్యా శాఖ నుండి మువ్వాకు సంకేతాలొచ్చాయి… డైట్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ కుర్చీని వదిలేసి వచ్చి అమరావతిలో రిపోర్టు చేయమని. మొన్న 6వ తేదీ మువ్వా రిలీవ్‌ అయ్యాడు. జిల్లా విద్యాశాఖలో వున్న సిబ్బంది, టీచర్లు రిలీఫ్‌గా ఫీలయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here