Home జాతీయ వార్తలు ముందే యుద్ధానికి సిద్ధమైన కేసీఆర్

ముందే యుద్ధానికి సిద్ధమైన కేసీఆర్

సాధారణ ఎన్నికలకు ఇంకా 8 నెలలు గడువు వుండగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యాడు. ఈ నెల 6వ తేదీన రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానించింది. శాసన సభ రద్దు తీర్మానాన్ని గవర్నర్ ఇ.సి.ఎల్ నరసింహన్ ఆమోదించారు. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయడమే కాకుండా 105 శాసనసభ నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా ముందుగానే ప్రకటించేసీ ఎన్నికల శంఖారావం పూరించారు. మరో 14శాసనసభా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సివుంది. ఎంఐఎంతో పొత్తు కుదిరేట్టట్లైతే ఈ సీట్లను సర్దుబాటు చేయవచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో అతితక్కువమంది మాత్రమే సీట్లను దక్కించుకోలేకపోయారు. అయితే అసెంబ్లీని కేసీఆర్ ముందే రద్దుచేయడంతో విపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇవే ఆఖరి ఎన్నికలంటూ వారు విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here