Home రాష్ట్రీయ వార్తలు ముందస్తు.. ముంచుతుందా?

ముందస్తు.. ముంచుతుందా?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎనిమిది నెలల ముందుగానే ఎన్నికల కూతేసాడు. రాష్ట్ర శాసనసభను రద్దు చేసి ఎన్నికల ఘంటారావాన్ని మోగిం చాడు. తెలంగాణ తొలి అసెంబ్లీయే పూర్తి కాలం కొనసాగకుండా ముందస్తు ఎన్ని కలకు సిద్ధమైంది. కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేయడమే కాకుండా 119 స్థానాలకు గాను 105 స్థానాల అభ్యర్థులను కూడా ముందు గానే ప్రకటించేసాడు. మిగిలిన 14సీట్లను కూడా ఎంఐఎంతో బేరసారాలు కుదుర్చు కోవడానికే ఆపినట్లుగా తెలుస్తోంది.

కేసీఆర్‌ ఇంత ముందుగా ఎన్నికలకు సిద్ధం కావడానికి ఒకే కారణం మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ ఎన్నికలే! ఆ రాష్ట్రాల శాసనసభలకు కూడా ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరపాలి. తెలంగాణ అసెంబ్లీకి నిర్ణీత కాలం ప్రకారమైతే 2019 ఏప్రిల్‌, మే నెలల్లో సాధారణ లోక్‌సభ ఎన్నికలతో పాటే ఎన్నికలు పెట్టాలి. కాని అంతకంటే ముందుగా ఈ మూడు రాష్ట్రాలలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే ఆ ప్రభావం తెలంగాణ ఎన్నికలపై పడు తుంది. కాబట్టే కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లాడు. ఈరోజు ఆ రాష్ట్రాలతో పాటే తెలంగాణ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి అక్కడి గెలుపోటముల ప్రభావం తెలం గాణపై వుండదు. అదీగాక తెలంగాణలో ప్రస్తుతానికైతే కేసీఆర్‌ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత లేదు. సాధ్యమైనంత వరకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వచ్చాడు. రాష్ట్ర విభజన జరిగిన సమ యంలో తెలంగాణ రాష్ట్రం ముందున్న అతిపెద్ద సమస్య కరెంట్‌ కొరత. కేసీఆర్‌ దానిని అధిగమించాడు. కరెంట్‌ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టాడు. భారీఎత్తున సాగునీటి ప్రాజెక్ట్‌లను మొదలు పెట్టడమే కాకుండా, మిషన్‌ భగీరధ పేరుతో ప్రతి చెరువునూ బాగు చేయిం చాడు. అనేక ప్రజాసంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు.

ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ను నిలువరించడం కాంగ్రెస్‌ ఒక్క పార్టీకే సాధ్యం కాదు. కాబట్టే కాంగ్రెస్‌, టీడీపీ, వామపక్షాలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. కేంద్రంలో నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి విపక్షాలు ఏ ఫార్ములాను అయితే అమలు చేస్తున్నాయో, అదే ఫార్ములాను ముందుగా తెలంగాణ ముం దస్తు ఎన్నికల్లో ప్రయోగించబోతున్నాయి.

కేసీఆర్‌కు కూడా తెలంగాణ ఎన్నికలు వడ్డించిన విస్తరి కాదు. బోలెడన్ని సవాళ్ళు ఆయన ముందున్నాయి. ఎంఐఎం విడిగా పోటీ చేస్తే మైనార్టీల ఓట్లు చీలిపోతాయి. కాంగ్రెస్‌, టీడీపీల పొత్తుతో తెలంగాణలో రెండు బలమైన సామాజిక వర్గాలు రెడ్డి, కమ్మ ఓటు బ్యాంకు ఒక్కటి కానుంది. నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో కాంగ్రెస్‌, ఖమ్మంలో టీడీపీ కేడర్‌ పటి ష్టంగా వుంది. కేసీఆర్‌కు అసలు పరీక్ష రాజధాని హైదరాబాద్‌లోనే ఎదురు కానుంది. హైదరాబాద్‌ సిటీలో టీఆర్‌ ఎస్‌కు సంస్థాగత బలం తక్కువ. 2014 ఎన్నికల్లో కూడా ఇక్కడ ఎక్కువ స్థానాలు కాంగ్రెస్‌, టీడీపీనే గెలుచుకున్నాయి. రెండేళ్ళ క్రితం జరిగిన జిహెచ్‌ఎంసి ఎన్ని కల్లో మాత్రమే హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగిరింది. సెటిలర్లు ఎక్కువుగా టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గుచూపడం వల్లే ఆ పార్టీ 99డివిజన్‌లు గెలిచి మేయర్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది. అప్పట్లో టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచిన సెటిలర్లు అలాగే వుంటే టీఆర్‌ఎస్‌ ఈసారి సిటీలోని మెజార్టీ స్థానాలు గెలవగలదు. లేదంటే ఇబ్బంది తప్పదు.

ముందస్తు ఎన్నికలకు పోయిన పార్టీలు బొక్కబోర్లా పడుతాయనే సెంటిమెంట్‌ వుంది. 2004లో కేంద్రంలో బీజేపీ, ఏపిలో టీడీపీ పరిస్థితి అదే! అలాగే గతంలో కొత్తగా ఏర్పాటైన రాష్ట్రాలలో మొదటిసారి గెలిచిన పార్టీ ఏదీ రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈ సెంటి మెంట్‌ను కేసీఆర్‌ ఎంతవరకు అధిగ మిస్తాడో చూడాలి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here