Home రాష్ట్రీయ వార్తలు ‘మాగుంట’.. ఏ ఇంట?

‘మాగుంట’.. ఏ ఇంట?

నెల్లూరు, ప్రకాశం జిల్లాల రాజకీయ తెరపై ఇప్పుడు ప్రధాన చర్చగా విన పడుతున్న పేరు.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఆయన టిడిపిని వదిలి వైసిపి తీర్థం పుచ్చుకోవడానికి దాదాపుగా ముహూర్తం ఖరారైన తరుణంలో వై.వి.సుబ్బారెడ్డి పేల్చిన సీటు బాంబు మొత్తం సీన్‌ను మార్చేసింది.

సుబ్బారెడ్డి మాటలతో మనస్తాపం చెందిన శీనయ్య ఇప్పుడు ఆలోచనలో పడి పోయి బుధవారమంతా నెల్లూరులోనే కూర్చుని తన అనుయాయులతో, అభిమాను లతో సమాలోచనలు జరిపాడు. మీకే సీటిస్తాం రండి.. అంటూ వైసిపి అధి ష్టానం పదేపదే ఓవైపు రాయబారాలు పంపుతుంటే, మరోవైపు మీరు మా పార్టీ లోనే ఉండండి… మీరడిగింది చేస్తాం.. అంటూ తెలుగుదేశం రాజకీయ బేరాలు మొదలుపెట్టింది.

బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకు నెల్లూరులోని మాగుంట కార్యాలయం కల్యాణి ఫిలిమ్స్‌ ఈ చర్చలకు వేదిక కాగా, ఇక్కడికి పలువురు వైసిపి, టిడిపి నేతలు వరుసపెట్టి మాగుంట మనసు తెలుసుకునే ప్రయత్నం చేశారు. చివరగా రాత్రి 9గంటల తర్వాత సరస్వతినగర్‌లోని మాగుంట నివాసానికి సీన్‌ మారడంతో మంత్రి సోమిరెడ్డి కూడా మాగుంట నివాసానికి వచ్చి రాత్రి 10.30 గంటల వరకు శీనయ్యను బుజ్జగించి పార్టీలో నిలుపుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.

శీనయ్య మాత్రం ఎవరేం చెప్పినా తనేం మాట్లాడకుండా మౌనముద్ర వహిం చాడని, రెండురోజులు ఆలోచించుకుని నిర్ణయం చెప్తానని చెప్పాడని ఆయన ముఖ్యులు చెప్తున్నారు. ఎక్కువమంది నెల్లూరు తెలుగుదేశం నుండి పోటీ చేయాలని చెప్పినప్పటికీ ఆయన మాత్రం వైసిపి వైపే మొగ్గు చూపుతున్నాడని కూడా వారంటున్నారు. ఇటు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి లేదా అటు తెలుగుదేశం పార్టీ సారధి చంద్రబాబునాయుడు నేరుగా రంగంలోకి దిగితే గానీ విషయం కొలిక్కి రాదన్నది శీనయ్య అనుయాయుల అభి ప్రాయం. మొత్తమ్మీద మరో రెండురోజుల్లో ఈ సస్పెన్స్‌కు తెరపడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here